జస్ట్ డొమైన్ నేమ్ విక్రయించి కోట్లు కొల్లగొట్టిన భారతీయుడు..లాభాలతో భారీగా విరాళం..అసలు బిజినెస్ ప్లాన్ ఇదే..
హబ్‌స్పాట్ సహ వ్యవస్థాపకుడు ధర్మేష్ షా 10 మిలియన్ డాలర్లతో 'chat.com' డొమైన్ పేరుని కొనుగోలు చేసి. ఇప్పుడు ఈ డొమైన్ నేమ్ ను అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ వార్త టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది.
ఎవరైనా భూములు కొంటారు… ఆస్తులు కొంటారు… కార్లు కొంటారు… బంగాళాలు కొంటారు... కానీ ఈ వ్యక్తి మాత్రం ఒక పేరు కొనేందుకు దాదాపు 8 కోట్లు ఖర్చుచేశాడు. అంతే కాదు ఆ పేరును అమ్మేసి వందల రెట్లు లాభాలను పొందాడు. అవును మీరు విన్నది నిజమే ధర్మేష్ షా అనే ఈ వ్యక్తి ఎనిమిది కోట్లు ఖర్చుపెట్టి ఓ డొమైన్ నేమ్ ను కొనుగోలు చేసి అనేక రెట్ల లాభానికి విక్రయించాడు అనే వార్త ప్రస్తుతం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే…
హబ్‌స్పాట్ సహ వ్యవస్థాపకుడు ధర్మేష్ షా 10 మిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి 'chat.com' అనే డొమైన్ పేరును కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఈ డొమైన్ నేమ్ ను అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. 'chat.com'ని విక్రయించడం ద్వారా ధర్మేష్ షా ఎంత మొత్తం పొందారో వెల్లడించలేదు. కానీ అతను వచ్చిన లాభాలలో 25,00,00 డాలర్ల మొత్తాన్ని ఖాన్ అకాడమీకి విరాళంగా ఇచ్చాడు. ధర్మేష్ షా భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ బిజినెస్ మాన్ .
ధర్మేష్ షా నేపథ్యం విషయానికి వస్తే అతను హబ్‌స్పాట్ సహ వ్యవస్థాపకుడు, ఈ సంస్థ 2006లో ప్రారంభమై ఇన్‌బౌండ్ మార్కెటింగ్ , సేల్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ 24 బిలియన్ డాలర్లతో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NYSE)లో లిస్ట్ అయి ఉంది.
chat.com డొమైన్ కొనుగోలుతో సంచలనం..
షా మొదట్లో chat.com అనే డొమైన్ పేరును కొనుగోలు చేసి లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశాడు. అతను డొమైన్ పేరును ఉపయోగించి ఏ కొత్త ఉత్పత్తిని సృష్టించలేదు. లింక్డ్‌ఇన్ పోస్ట్ ద్వారా, అతను chat.com డొమైన్ పేరును కొనుగోలు చేయడానికి గల కారణాన్ని వివరించాడు. Chat.comను కొనుగోలు వెనుక ప్రధాన కారణం AI సాఫ్ట్‌వేర్ ద్వారా కమ్యూనికేట్ చేసేందుకు ఓ లాంగ్వేజీని సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు.
కొనుగోలుదారు పేరును వెల్లడించలేదు
తన లింక్డిన్ పోస్టులో అతను ఇంకా ఇలా రాశాడు. నేను 250,000 లాభాన్ని పొందాను , ఈ మొత్తాన్ని సల్ ఖాన్ , ఖాన్ అకాడమీకి విరాళంగా ఇచ్చాను అని ప్రకటించారు. అయితే, తాను chat.comను విక్రయించిన మొత్తాన్ని షా వెల్లడించలేదు. అలాగే, కొనుగోలుదారు పేరును కూడా ఆయన వెల్లడించలేదు. ఖాన్ అకాడమీ ఒక లాభాపేక్ష లేని విద్యా సంస్థ. ఇది వివిధ సబ్జెక్టులలో నేర్చుకోవడానికి ఉచిత ఆన్‌లైన్ కోర్సులు, సిలబస్‌ను అందిస్తుంది.
అయితే డొమైన్ నేమ్స్ సృష్టించి విక్రయించడం అనేది ఈరోజు వ్యాపారం కాదు గత 20 సంవత్సరాలుగా ఈ వ్యాపారం వేగంగా విస్తరించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి దిగ్గజ బ్రాండ్స్ కు చెందినటువంటి డొమైన్ నేమ్స్ ఈ విధంగానే కొనుగోలు చేసినవి ఉన్నాయి. ఒకవేళ యువత ఉపాధి మార్గంలో వెళ్లాలి అనుకుంటే టెక్నాలజీ ప్రపంచంలో ఇలాంటి అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయన్న సంగతి గమనించాల్సి ఉంది.