అమెరికా మల్టీనేషనల్ కంపెనీ అమెజాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఔషధ మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, అపోలో ఫార్మసీలో పెట్టుబడులు పెట్టాలని అమెజాన్ కంపెనీ పరిశీలిస్తోందని తెలిపింది. అపోలో ఫార్మసీలో అమెజాన్ దాదాపు 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోందని నివేదికలో పేర్కొంది.

అమెజాన్ ఇప్పటికే భారతదేశంలో ఔషధాలను పంపిణీ చేస్తుంది. దేశీయంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మరోపక్క పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ ఫార్మసీ విభాగంలో విస్తరణకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇటీవల ఆన్‌లైన్ ఫార్మసీ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయగా, ఇ-ఫార్మసీ సంస్థ 1 ఎంజిలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయటానికి టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

also read ఫ్యూచర్‌ రిటైల్‌లోని హెరిటేజ్‌ ఫుడ్స్‌ వాటా విక్రయం.. 3.65 శాతనికి రూ.132 కోట్లు.. ...

అపోలో ఫార్మసీ అనేది అపోలో హాస్పిటల్స్ లో  ఒక భాగం. ఆసియాలో అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ గ్రూప్ లో ఒకటిగా పరిగణించబడుతున్న అపోలో భారతదేశంలో మాత్రమే 3వెలకి పైగా అవుట్‌లెట్లు ఉన్నాయి. 

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏ‌డబల్యూ‌ఎస్) అమెజాన్ హెల్త్‌లేక్‌ను ప్రవేశపెట్టింది, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు వారి డేటా మొత్తాన్ని క్లౌడ్‌లో స్టోరేజ్ చేయడానికి వీలు కల్పిస్తుంది.  

 క్లౌడ్ టెయిల్లో అమెజాన్ 24 శాతం వాటా పొందింది. దేశీయంగా నెట్‌మెడ్స్‌, ఫార్మ్‌ఈజీ, మెడ్‌లైఫ్‌ తదితర పలు కంపెనీలు ఆన్‌లైన్‌ ద్వారా ఔషధ విక్రయాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.