తన పరోపకారి కార్యక్రమాలను విస్తరించాలనే నిబద్ధతకు అనుగుణంగా అమెజాన్ కోఫౌండర్ జెఫ్ బెజోస్ మాజీ భార్య మాకెంజీ స్కాట్ గత నాలుగు నెలల్లో రూ. 29,400 కోట్లు వందలాది సంస్థలకు ఇస్తున్నట్లు ప్రకటించారు.

పరోపకారి, రచయిత ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య అయిన మాకెంజీ స్కాట్  కోవిడ్‌-19 బాధితులను ఆదుకునేందుకు ప్రధానంగా ఈ పంపిణీ చేపట్టారు. 

మాకెంజీ స్కాట్  జూలై 2019లో 116 లాభాపేక్షలేని, విశ్వవిద్యాలయాలు, సమాజ అభివృద్ధి సమూహాలు, న్యాయ సంస్థలకు 1.68 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చింది. అలాగే ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సమానత్వం తదితరాలకు మద్దతుగా జులైలో 1.7 బిలియన్‌ డాలర్లను వెచ్చించినట్లు మాకెంజీ స్కాట్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

also read వచ్చే 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోని టాప్ -3 ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంటుంది: ముకేష్ అంబానీ ...

ఈ సంవత్సరంలో మహమ్మారి కారణంగ ఆర్థికంగా ప్రభావితమైన వారికి అత్యవసరంగా ఇచ్చే 2020 ప్రయత్నాలను వేగవంతం చేయడంలో మాకెంజీ స్కాట్ సలహాదారుల బృందాన్ని కోరారు.

కోవిడ్‌-19 ధాటికి యూఎస్‌లో ఆరోగ్యం, ఆహారం, ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయంగా 384 ఆర్గనైజేషన్స్‌కు నిధులు అందించినట్లు మాకెంజీ స్కాట్‌ వెల్లడించారు. ఫుడ్‌ బ్యాంకులు, ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్స్‌కు 4.1 బిలియన్‌ డాలర్లను అందించినట్లు ఒక బ్లాగులో పేర్కొన్నారు.

 ఈ ఏడాది ఇప్పటివరకూ మాకెంజీ స్కాట్‌ 5.7 బిలియన్‌ డాలర్లను పంపిణీకి వెచ్చించడం గమనార్హం. పంపిణీ కోసం 6,500 సంస్థలను పరిశీలించాక 384 ఆర్గనైజేషన్స్‌ను సలహాదారులు ఎంపిక చేసినట్లు మాకెంజీ స్కాట్‌ తెలియజేశారు. ఆహారం, జాతి వివక్ష, పేదరికం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ నిధులను విడుదల చేసినట్లు వివరించారు.