ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల కూతురి పేరును వెల్లడించిన అంబానీ ఫ్యామిలీ.. నెటిజన్ల ప్రశంసలు..పేరుకి అర్ధం తెలుసా
అంబానీ పిల్లలకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ కుమారుడు అయిన ధనరాజ్ నత్వానీ ట్విట్టర్ వేదికగా కుమార్తె పుట్టిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు.
భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ అండ్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాష్ అంబానీ అండ్ శ్లోకా అంబానీకి కొద్ది రోజుల క్రితం పండంటి కుమార్తె జన్మించింది. తాజగా వీరికి పుట్టిన బిడ్డకి పేరు కూడా పెట్టారు.
ఆకాష్ అంబానీ అండ్ శ్లోకా అంబానీల కుమార్తెకు 'వేద' అని పేరు పెట్టారు. 'వేద' అనేది సంస్కృత మూలానికి చెందిన అమ్మాయి పేరు, దీని అర్థం జ్ఞానం లేదా వివేకం.ఈ సందర్బంగా అంబానీ కుటుంబం ప్రత్యేక కార్డును షేర్ చేస్తూ పేరును ప్రకటించారు. " లార్డ్ శ్రీ కృష్ణు అండ్ ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల ఆశీస్సులతో పృథ్వీ తన చెల్లెలు వేద ఆకాష్ అంబానీ పేరును ప్రకటిస్తున్నట్లు" కార్డ్ లో ఉంది. కార్డులో అంబానీ, మెహతా కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి.
అంబానీ పిల్లలకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ కుమారుడు అయిన ధనరాజ్ నత్వానీ ట్విట్టర్ వేదికగా కుమార్తె పుట్టిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు.
అంబానీపై నెటిజన్ల ప్రశంసలు
ముకేశ్ అంబానీ మనవరాలికి 'వేద' అని పేరు పెట్టడంతో నెటిజన్లు అంబానీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వేద అనే పేరు ఉన్న వారు చాలా చక్కగా ఉంటారని పృథ్వీ, వేద రెండు పేర్లు చాలా బాగా ఆలోచించిన పేర్లని, వేద చాలా మంచి పేరు అని నెటిజన్లు అంటున్నారు.
ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాకి 31 మే 2023న మొదటి కుమార్తె జన్మించింది. ఆకాష్, శ్లోకాల రెండవ కుమార్తె వేద. వారి మొదటి బిడ్డకు పృథ్వీ అని పేరు పెట్టారు, అతని వయస్సు రెండు సంవత్సరాలు. ఏప్రిల్ నెలలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలో శ్లోకా అంబానీ బేబీ బంప్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీ మార్చి 2019 లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి రాజకీయ నాయకుల నుండి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, బచ్చన్ కుటుంబం, దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్, అలియా భట్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చింది.