Asianet News TeluguAsianet News Telugu

ఒకరు రీఛార్జ్‌ చేయించుకుంటే నలుగురికి ఇంటర్‌నెట్‌.. ఎయిర్‌టెల్‌ సూపర్‌ ఆఫర్‌

పెరిగిన టారిఫ్‌ ధరలతో రీఛార్జ్‌ చేయించాలంటేనే జేబులు చెక్‌ చేసుకోవాల్సి వస్తోంది కదూ.. ఇలాంటప్పుడు ఇంట్లో ఒకరు రీఛార్జ్‌ చేయించుకుంటే నలుగురు డాటా ఉపయోగించుకొనే ఆఫర్‌ ఉంటే.. మీరు విన్నది నిజమే.. ఆ వివరాలు తెలుసుకుందాం.. రండి..
 

Airtel New Family Plan: One Recharge, Internet for Four at Home sns
Author
First Published Aug 21, 2024, 2:43 PM IST | Last Updated Aug 21, 2024, 2:43 PM IST

దేశంలోనే ప్రముఖ టెలికాం  కంపెనీలైన జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా టారిఫ్ ధరలను పెంచి వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ధరలు పెంచకుండా 4జీ, 5జీ నెట్ వర్క్ సేవలను పెంచుతూ పోటీ సంస్థలకు గట్టి దెబ్బకొడుతోంది. ఈ నాటకీయ పరిణామంతో ప్రజలు కూడా తమ నెట్వర్క్ ను బీఎస్ఎన్ఎల్ లోకి మార్చుకుంటున్నారు. రీఛార్జ్ ధరలు పెరిగిన కారణంగా వినియోగదారులంతా తక్కువ ధరలో అత్యధిక ఆఫర్‌ను అందించే ప్లాన్ కోసం చూస్తున్నారు. మీరు కూడా తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే ఎయిర్ టెల్ ఇస్తున్న ఈ ప్లాన్ గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. 

ఆఫర్ ఇస్తోంది ఎయిర్ టెల్..
దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టైల్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. జియోతో పోటీ వల్ల ఎయిర్‌టైల్ ఇప్పటికే తన పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్లకు అనేక ఆఫర్లను అందిస్తోంది. అలాంటి ప్రత్యేక ఆఫర్లలో ఒకటి ఫ్యామిలీ రీఛార్జ్ ప్యాక్.  ఈ ప్లాన్ కింద వినియోగదారులు ఒకేసారి నాలుగు ఫోన్‌ల వరకు రీఛార్జ్ సౌకర్యాలు పొందవచ్చు. ఒక వ్యక్తి రీఛార్జ్ చేసుకుంటే ఇంట్లో నలుగురు వ్యక్తులు దీని ప్రయోజనాన్ని పొందవచ్చు. 

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ రీఛార్జ్ ప్లాన్‌లు
ఎయిర్‌టైల్ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ రీఛార్జ్ ధరలు రెండు ఉన్నాయి. అవి రూ.1,199, రూ.1,399.  ఈ రెండు ప్లాన్‌లలో అదనంగా మరో మూడు మొబైల్ నంబర్‌లను లింక్ చేయవచ్చు. అంటే ఒక రీఛార్జ్ పథకం కింద నలుగురు ప్రయోజనం పొందవచ్చన్న మాట. 

రూ.1,199 ప్లాన్ వివరాలు..
ఇది ముగ్గురు వ్యక్తులను లింక్ చేసే కనెక్షన్. ఎయిర్‌టైల్ నంబర్‌కు రూ. 1,199 రీఛార్జ్ చేస్తే అపరిమిత కాల్‌ల ప్రయోజనం లభిస్తుంది. రోజుకు 100 SMS, 30 GB డేటా అందుబాటులో ఉంటుంది. అయితే రీఛార్జ్ చేసిన కనెక్షన్‌కు 100 జీబీ డేటా, మిగతా మూడు కనెక్షన్‌లకు 30 జీబీ డేటా చొప్పున కేటాయించడం జరుగుతుంది. వీటితో పాటు అదనంగా మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, ప్లే వింక్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్‌లకు ఆరు నెలల పాటు సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అంతేకాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ OTTకి ఒక సంవత్సరం పాటు ఉచిత సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. 

రూ.1,399 ప్లాన్ వివరాలు..
రూ. 1,399 పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ మాక్సిమ్ ముగ్గురు వ్యక్తులతో ఆఫర్‌లను పంచుకోవచ్చు. అపరిమిత కాల్, రోజుకు 150 SMS, 30 GB డేటా. Airtail Extreme, Play Wink Premium, Amazon Prime ఆరు నెలల పాటు మరియు Disney Plus Hotstar ఒక సంవత్సరం పాటు ప్రాథమిక Netflix (Amazon Prime Video, Disney Plus Hotstar, Netflix) అందించబడతాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios