నేటి నుంచి Aeroflex Industries IPO ప్రారంభం..ఈ నెల 24 వరకూ పెట్టుబడికి చాన్స్..మినిమం ఎంత పెట్టుబడి పెట్టాలంటే
ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ IPO ఆగస్టు 22 నుండి తెరుచుకోనుంది. మీరు ఈ కంపెనీ IPOలో ఆగస్టు 24 వరకు డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. కంపెనీ IPO ధర బ్యాండ్ ఏమిటి, దాని ఇష్యూ పరిమాణం ఏంటి, మీరు దాని గురించి పూర్తి వివరాలును ఇక్కడ మనం తెలుసుకుందాం.
ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలోని కంపెనీ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ IPO ఈరోజు అంటే మంగళవారం నుంచి ప్రారంభమైంది. కంపెనీ రూ.351 కోట్ల ఐపీఓ ఆగస్టు 24 వరకు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటుంది. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ IPO ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేర్‌కి రూ.102 నుండి రూ.108 వరకు నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా రూ.351 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఏరోఫ్లెక్స్ IPO తాజా ఇష్యూ వల్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) విండో కింద షేర్ల తాజా జారీ షేర్ల విక్రయం జరుగుతుంది. కంపెనీ ఇష్యూకి యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది.
ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ IPO సబ్‌స్క్రిప్షన్ స్టేటస్..
ఈరోజు ఉదయం 11:42 నాటికి, IPO 1.74 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. అయితే దాని రిటైల్ భాగం 2.33 రెట్లు సబ్‌స్క్రైబ్ చేశారు. బుక్ బిల్డ్ ఇష్యూ , NII భాగం 2.70 సార్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.
గ్రే మార్కెట్‌లోనూ జోరు
గ్రే మార్కెట్‌లో ఏరోఫ్లెక్స్ షేర్లు మరింత బలపడ్డాయి. ఒక రోజు క్రితం ఇది రూ. 58 అంటే దాదాపు 54 శాతం GMP (గ్రే మార్కెట్ ప్రీమియం)తో ఎగువ ధర బ్యాండ్ వద్ద పలకడం విశేషం. ఈ రోజు ఉదయం ఇది రూ. 68కి చేరుకుంది. .
ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ IPO ధర:
కంపెనీ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ IPO , ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేర్‌కి రూ.102 నుండి రూ.108గా నిర్ణయించింది.
ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ IPO తేదీ:
ఇష్యూ ఈరోజు తెరుచుకొని, ఆగస్టు 24, 2023 వరకు ఓపెన్ అయి ఉంటుంది.
ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ IPO పరిమాణం:
ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 351 కోట్లు సమీకరించనుంది, ఇందులో రూ. 162 కోట్లు తాజా ఇష్యూ ద్వారా, మిగిలిన రూ. 189 కోట్లు OFS కోసం రిజర్వ్ చేశారు. ఈ ఇష్యూలో, ప్రైస్ బ్యాండ్ రూ. 102-108 ఒక్కో లాట్ లో 130 షేర్లు డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు., అంటే రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.14,040 పెట్టుబడి పెట్టాలి. అదే సమయంలో, ఈ ఇష్యూలో 50 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (QIB), 15 శాతం నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII) , 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. .
ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ IPO కేటాయింపు తేదీ:
ఐపీఓ విజయవంతమైన తర్వాత ఆగస్టు 29న షేర్ల కేటాయింపులు జరపవచ్చు. దీని తరువాత, షేర్లు సెప్టెంబర్ 1 న మార్కెట్లో లిస్ట్ అవుతాయి.
ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకోండి:
ఏరోఫ్లెక్స్ కంపెనీ ప్లాంట్ నవీ ముంబైలోని తలోజాలో ఉంది.కంపెనీ Flexible Flow Solution ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ ఉత్పత్తులు గ్యాస్ లేదా ద్రవ ప్రవాహానికి ఉపయోగిస్తారు. ఈ సంస్థ యూరప్, అమెరికాతో సహా 80 కంటే ఎక్కువ దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. కంపెనీ విక్రయాల్లో 80 శాతం ఎగుమతులు కాగా, 20 శాతం దేశీయ మార్కెట్‌లోనే జరుగుతున్నాయని కంపెనీ యాజమాన్యం తెలిపింది.