Adhar Card: జూన్ 14 వరకూ బంపర్ అవకాశం.. ఆధార్ కార్డులో మార్పులు కావాలంటే ఎలాంటి చార్జీలు చెల్లించే పనిలేదు..

దేశంలోని అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటి. అన్ని ముఖ్యమైన పత్రాలకు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. ఇదిలావుండగా, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడం తప్పనిసరి. అయితే ఈ నెల 14 వరకూ ఉచితంగానే ఆధార్ కార్డులోని వివరాలును అప్ డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. 

Adhar Card: Bumper opportunity till June 14.. No need to pay any charges for changes in Aadhaar card MKA

ఆధార్ కార్డు మార్పులు చేయాలా..అయితే ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆన్‌లైన్‌లో ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని UIDAI కల్పించింది. మై ఆధార్ పోర్టల్‌లో ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయవచ్చు. అయితే, ఈ అవకాశం మార్చి 15, 2023 నుండి జూన్ 14, 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే, ఈ సదుపాయం మై ఆధార్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పనికి ఇప్పటికీ ఆధార్ కేంద్రాల్లో రూ.50 వసూలు చేస్తున్నారు. ఫీజులు చెల్లించాలి. కాబట్టి, ఆధార్ కార్డ్ సమాచారాన్ని ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువుకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. UIDAI 10 సంవత్సరాల క్రితం జారీ చేయబడిన, ఇప్పటి వరకు అప్‌డేట్ చేయలేని ఆధార్ కార్డ్‌ల అప్ డేషన్ ను ప్రోత్సహిస్తోంది. 

ఎలా అప్‌డేట్ చేయాలి?
ఆధార్ కార్డ్‌లోని ఒక వ్యక్తి బయోమెట్రిక్ డేటా, చిరునామా, ఇమెయిల్, ఫోన్ నంబర్, ఇతర సమాచారంలో ఏదైనా మార్పు ఉంటే, వాటిని ఆధార్‌లో అప్‌డేట్ చేయడం అవసరం. పిల్లల కోసం ఆధార్ కార్డు తయారు చేసినట్లయితే, ఐదేళ్ల వయస్సులో మరియు 15 ఏళ్ల వయస్సులో ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడం అవసరం. ఈ పరిస్థితులు కాకుండా, UIDAI సూచనల ప్రకారం మీరు ఆధార్ కార్డ్ పొంది 10 సంవత్సరాలు అయినట్లయితే ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేయడం అవసరం. 

ఆధార్‌లో సమాచారాన్ని ఎలా అప్‌డేట్ చేయాలి?
>> UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
>>  మై ఆధార్‌పై క్లిక్ చేయండి.
>>  ఆ తర్వాత 'అప్‌డేట్ ఆధార్' ఎంచుకోండి.
>> మీ ఆధార్ నంబర్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
>>  ఆ తర్వాత 'Send OTP' బటన్‌పై క్లిక్ చేయండి.
>>  ఇప్పుడు మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
>>  లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి.
>> మీరు ఏ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి. ఉదాహరణకు, చిరునామాను మార్చాల్సిన అవసరం ఉంటే, 'చిరునామా నవీకరణ' ఎంచుకోండి.
>> ఇప్పుడు మీ చిరునామా ధృవీకరణ పత్రం యొక్క స్కాన్ కాపీని అప్‌లోడ్ చేయండి.
>>  ఆ తర్వాత 'సమర్పించు' బటన్‌పై క్లిక్ చేయండి.
>> ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) పంపబడుతుంది. 
>> మీ చిరునామా లేదా ఏదైనా ఇతర సమాచారం 15 రోజుల్లోపు ఆధార్‌లో అప్‌డేట్ చేయబడుతుంది. 

ఆధార్ అనేది దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు. దేశంలో ఆధార్‌ను ప్రధాన ధృవీకరణ పత్రంగా ఉపయోగిస్తారు. బ్యాంకు ఖాతా తెరవడానికి, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, మొబైల్ కనెక్టివిటీకి, ప్రభుత్వ రాయితీలు పొందడానికి మరియు సాంఘిక సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఈరోజు ఏ ఉద్యోగానికైనా ఆధార్ కార్డు తప్పనిసరి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios