Asianet News TeluguAsianet News Telugu

Adani Wilmar షేర్లు వరుసగా మూడో రోజులుగా అప్పర్ సర్క్యూట్, ఇన్వెస్ట్ చేయాలా వద్దా..బ్రోకరేజీల సలహా ఇదే...

స్టాక్ మార్కెట్లో వరుసగా మూడో రోజులుగా అదానీ విల్మార్ షేరు (Adani Wilmar Share) జంప్ నమోదు చేస్తోంది. అదానీ గ్రూప్‌కు చెందిన ఈ FMCG కంపెనీ వరుసగా రెండో రోజు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ వద్ద లాకైంది. దీంతో ఇన్వె్టర్లు ఎలాంటి ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలా అనే అంశంపై బ్రోకరేజీ సంస్థలు ఏమంటున్నాయో తెలుసుకుందాం.

adani wilmar hit upper circuit icici securities gives hold rating
Author
Hyderabad, First Published May 18, 2022, 5:59 PM IST

బుధవారం మార్కెట్ ప్రారంభం కాగానే అదానీ విల్మార్ షేర్లు ఒక్క సారిగా ఎగిసాయి. మంగళవారం నాటి ముగింపు ధర రూ.606.25 వద్ద ఎన్‌ఎస్‌ఈలో Adani Wilmar Share ట్రేడింగ్ ప్రారంభం కాగా,  కొద్దిసేపటికే రూ.636.55కు చేరుకొని, 5 శాతం ఎగువ సర్క్యూట్‌ వద్ద లాకైంది. మంగళవారం కూడా అప్పర్ సర్క్యూట్ తాకడం విశేషం. అదానీ విల్మార్ ఈ ఏడాది ఇప్పటి వరకు 135 శాతం రాబడులను పెట్టుబడిదారులకు అందించింది. రూ. 878 గరిష్ట స్థాయి నుంచి కరెక్షన్ పూర్తి చేసుకున్న Adani Wilmar Share, ప్రస్తుతం ర్యాలీతో ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగించనుంది.

నిపుణుల సలహా ఇదే...
అదానీ విల్మార్ (Adani Wilmar Share) షేర్ ప్రస్తుతం అస్థిరంగా కదులుతున్న నేపథ్యంలో ఈ షేర్లను హోల్డ్ చేయాలా, లేక పోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, అనే దానిపై నిపుణుల సలహా తెలుసుకోవడం ముఖ్యం. బ్రోకరేజ్ హౌస్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇన్వెస్టర్లు తమ షేర్లను ఉంచుకోవాలని సూచించింది. సంస్థ ప్రకారం, బ్రాండెడ్ ఎడిబుల్ ఆయిల్ మార్కెట్‌లో అదానీ విల్మార్ మార్కెట్ లీడర్ గా ఉంది. ఈ పరిశ్రమలో కంపెనీదే ఆధిపత్యం. మార్కెట్‌లో బలమైన పోటీ కారణంగా, కంపెనీకి  మంచి ఎడ్జ్ ఉంది.

Adani Wilmar విస్తరించాలని యోచిస్తోంది
అదానీ విల్మార్ ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్‌లోకి విస్తరించే యోచనలో ఉన్నట్లు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తెలిపింది. కంపెనీ బలమైన బ్రాండ్ ఫార్చ్యూన్ నేతృత్వంలో విస్తరణ కోసం ప్రయత్నిస్తోందని, బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది. అంతేకాదు కంపెనీ ఈ విభాగంలో అద్భుతాలు చేయగలదని నమ్ముతున్నట్లు పేర్కొంది. 

ఇదిలా ఉంటే....అదానీ గ్రూప్‌కు చెందిన ఎఫ్‌ఎంసిజి కంపెనీ అదానీ విల్మార్ (Adani Wilmar) మరో రికార్డును నెలకొల్పింది. అదానీ విల్మార్ (Adani Wilmar) ప్రస్తుతం  హిందుస్థాన్ యూనిలీవర్‌ను అధిగమించి దేశంలోనే అతిపెద్ద FMCG కంపెనీగా అవతరించింది. అదానీ విల్మర్ గత ఆర్థిక సంవత్సరం (FY22)లో కార్యకలాపాల ద్వారా రికార్డు ఆదాయాన్ని పొందారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అదానీ విల్మార్ (Adani Wilmar) ఆదాయం ఏడాది ప్రాతిపదికన 46.2 శాతం పెరిగింది.

హిందుస్థాన్ యూనిలీవర్ ను దాటేసిన అదానీ విల్మార్ (Adani Wilmar)
గత ఆర్థిక సంవత్సరంలో ఎడిబుల్ ఆయిల్స్ విభాగం నుంచి అదానీ గ్రూప్ భారీగా లాభపడింది. ఈ ఏడాది కంపెనీ రూ.54,214 కోట్ల వార్షిక ఆదాయాన్ని పొందింది.  మరోవైపు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో హిందుస్థాన్ యూనిలీవర్ ఆదాయం రూ.51,468 కోట్లు నమోదు చేసింది. ఈ విధంగా చాలా కాలంగా మొదటి స్థానంలో ఉన్న హిందుస్థాన్ యూనిలీవర్ అదానీ విల్మార్ (Adani Wilmar)ను వెనక్కి నెట్టింది. ఇదిలా ఉంటే  సరిగ్గా ఏడాది క్రితం అంటే అదానీ విల్మర్  2020-21 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 37,090 కోట్లుగా ఉంది.

ఎడిబుల్ ఆయిల్ వ్యాపారం అదృష్టాన్ని మార్చింది
అదానీ విల్మార్ (Adani Wilmar) ఎడిబుల్ ఆయిల్ వ్యాపారం నుండి అత్యధికంగా లాభపడింది. ఈ వ్యాపారం మాత్రమే గత ఆర్థిక సంవత్సరంలో విల్మార్ ఆదాయంలో 84 శాతం అందించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విల్మార్ ఎడిబుల్ ఆయిల్స్ అమ్మకాలు రూ. 30,818 కోట్లుగా ఉన్నాయి. ఇది ఏడాది తర్వాత 47.3 శాతం పెరిగి రూ. 45,401 కోట్లకు చేరుకుంది. ఇండస్ట్రీ ఎస్సెన్షియల్స్ వ్యాపారం ద్వారా కంపెనీ తన ఆదాయంలో దాదాపు 11.4 శాతం వాటాను పొందుతోంది. ఈ విభాగంలో విక్రయాలు ఏడాది క్రితం రూ.4,366 కోట్లతో పోలిస్తే 42 శాతం పెరిగి రూ.6,191.5 కోట్లకు పెరిగాయి.

ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారం ఇప్పటికీ నష్టాల్లోనే ఉంది
అదానీ విల్మార్ (Adani Wilmar) ఇటీవల ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఈ విభాగం ఇప్పటికీ లాభాలను ఆర్జించలేదు, కానీ దాని ఆదాయం 38 శాతం పెరిగింది. అదానీ విల్మార్ (Adani Wilmar) ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 22.5 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈ వ్యాపారం  ఆదాయం ఏడాది క్రితం రూ.1,905.6 కోట్ల నుండి రూ.2,621.3 కోట్లకు పెరిగింది.

కోహినూర్‌ (Kohinoor) బాస్మతి బ్రాండ్ సొంతం చేసుకున్న అదానీ విల్మర్..
ఇదిలా ఉంటే, ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో తన ఆధిపత్యాన్ని పెంచేందుకు అదానీ విల్మార్ (Adani Wilmar) సరికొత్త డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్‌లో అదానీ విల్మార్ (Adani Wilmar), అమెరికన్ కంపెనీ మెక్‌కార్మిక్ నుండి ప్యాకేజ్డ్ ఫుడ్ బ్రాండ్ కోహినూర్‌ (Kohinoor)ను కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ ఎంత వరకు జరిగిందనేది ఇంకా వెల్లడి కాలేదు. ఈ డీల్‌లో అదానీ అమెరికన్ కంపెనీకి చెందిన ప్రీమియం బాస్మతి రైస్ బ్రాండ్‌ను పొందడమే కాకుండా, చార్మినార్, ట్రోఫీ వంటి  బ్రాండ్‌లు కూడా సొంతం చేసుకుంది.  ప్రస్తుతం ఈ బ్రాండ్ల విలువ కలిపి దాదాపు రూ.115 కోట్లు.
 

Follow Us:
Download App:
  • android
  • ios