మూడు రోజుల రెస్ట్ ఫార్ములా యూకేలో దాదాపు 61 కంపెనీల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టగా, చక్కటి ఫలితాలను అందించింది. దీంతో ఈ పని పద్ధతిని విస్తరించేందుకు పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.

వారానికి నాలుగు రోజులు పని చేసి మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటే ఎలా ఉంటుంది. వావ్ అంత కన్నా అదృష్టం ఉంటుందా అని భావిస్తున్నారా, అయితే వారానికి మూడు రోజుల సెలవు ఫార్ములా యూకేలో సూపర్ హిట్ అయ్యింది. నిజానికి ఈ నాలుగు రోజుల పని, మూడు రోజుల రెస్ట్ ఫార్ములా యూకేలో దాదాపు 61 కంపెనీల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టగా, చక్కటి ఫలితాలను అందించింది. దీంతో ఈ పని పద్ధతిని విస్తరించేందుకు పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. నిజానికి వారానికి మూడు రోజుల సెలవు ప్రయోగం ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ పెరిమెంట్ గా బ్రిటన్‌లో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన నివేదిక ఒకరోజు క్రితమే బహిర్గతమైంది. 

ఈ ప్రాజెక్ట్ గత జూన్ నుండి ప్రారంభమైంది.
ఈ పైలట్ ప్రాజెక్ట్ గత జూన్‌లో బ్రిటన్‌లో ప్రారంభమైంది. వివిధ రంగాలకు చెందిన మొత్తం 61 కంపెనీలను ఇందులో చేర్చారు. ఈ పరిశోధన సూత్రం ఏమిటంటే, ఉద్యోగులు 4 రోజులు పని చేయాలి. 3 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. ఇందుకోసం 61 కంపెనీలకు చెందిన 3000 మంది ఉద్యోగులను ఎంపిక చేసి, వీరి నుంచి 4 రోజులు పని తీసుకుని, వారికి 3 రోజులు విశ్రాంతి అంటే వీక్లీ ఆఫ్ ఇచ్చారు.

ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, బోస్టన్‌లకు చెందిన నిపుణులు ఈ ఫార్ములా ఎంతవరకు పని చేస్తుందా అని చూడటానికి ఈ ప్రాజెక్ట్‌ లో భాగం అయ్యారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, బోస్టన్ కాలేజీకి చెందిన నిపుణులు ఈ ప్రాజెక్టును నిశితంగా పరిశీలించారు? శుభవార్త ఏమిటంటే, దాదాపు 91 శాతం కంపెనీలు 3 రోజుల ఆఫ్ ఫార్ములాపై పాజిటివ్ గా ఉన్నాయని, దీనిని మంచి చొరవగా పేర్కొన్నాయి.

ఈ ఫార్ములా 10 కి 8.5 రేటింగ్ వచ్చింది.
ఈ ప్రయోగం ఫలితంగా 91 శాతం కంపెనీలు ఈ ఫార్ములాకు 10 పాయింట్లకు గానూ 8.5 రేటింగ్ ఇచ్చాయి, ఇది చాలా మంచి స్కోర్‌గా పరిగణిస్తున్నారు. ఈ ఫార్ములాను ప్రయత్నించడం వల్ల కంపెనీల ఆదాయం పెరిగిందని కంపెనీలు కూడా అంగీకరించాయి. అదనంగా, ఇతర కంపెనీలు కూడా ఉద్యోగులకు నాలుగు పని దినాలు, వారానికి మూడు రోజులు సెలవు ఇవ్వడం ద్వారా వారి ఆరోగ్య సమస్యలు సైతం తగ్గాయి.