Asianet News TeluguAsianet News Telugu

ఆధార్ తో లింక్... 20కోట్ల పాన్ కార్డులు రద్దు?

మీ పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేశారా...? చేసుకోకపోతే త్వరగా చేసుకోండి. వచ్చే నెల 31వ తేదీలోగా పాన్ ని ఆధార్ తో లింక్ చేయకపోతే మీ పాన్ రద్దు అయిపోతుంది. 

20 Crore PAN Cards to Become Junk After August 31 if Not Linked With Aadhar Number
Author
Hyderabad, First Published Jul 9, 2019, 2:05 PM IST

మీ పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేశారా...? చేసుకోకపోతే త్వరగా చేసుకోండి. వచ్చే నెల 31వ తేదీలోగా పాన్ ని ఆధార్ తో లింక్ చేయకపోతే మీ పాన్ రద్దు అయిపోతుంది. పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు ఇంకా 40 రోజుల గడువు ఉంది. ఈ లోపు వాటిని లింక్‌ చేసుకోకపోతే.. దాదాపు 20 కోట్ల పాన్‌కార్డులు రద్దు కానున్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) అధికారి తాజాగా వెల్లడించారు. 

దేశం మొత్తంలో 43 కోట్ల మంది పాన్ కార్డ్‌ని కలిగి ఉన్నారని, 120 కోట్ల మందికి ఆధార్‌ కార్డు ఉందని ఆ అధికారి తెలిపారు. ఇప్పటివరకు పాన్‌ కార్డుల్లో 50శాతం మాత్రమే ఆధార్‌తో లింక్‌ అయ్యాయని తెలిపారు. ఇక, ఆధార్ కార్డు లేని 40 రోజుల్లో దీనిని తీసుకొని.. పాన్‌తో అనుసంధానించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

చాలా మంది లోన్ కోసం చట్టవిరుద్దంగా పాన్ లు పొందారని అధికారులకు తెలిసింది. దీంతో... పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయాలనే నియమాన్ని పెట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios