న్యూ ఢీల్లీ: తక్కువ ఆదాయ వర్గాలకు అరుంధతి గోల్డ్ స్కీమ్ అనే బంగారు పథకాన్ని అస్సాం ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది, దీని పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకునే వధువులకు ఒక 10 గ్రాముల బంగారాన్ని అందిస్తుందని ప్రకటించింది. అస్సాం ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో 300 కోట్ల రూపాయలను అరుంధతి బంగారు పథకానికి కేటాయించింది.

అరుంధతి బంగారు పథకం గురించి : 
5 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షిక ఆదాయంగల కుటుంబాలకు చెందిన కొత్తగా పెళ్లి చేసుకునే వధువులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తులం (10 గ్రాములు) బంగారాన్ని అందిస్తుంది.

అరుంధతి బంగారు పథకం ఒక కుటుంబంలోని మొదటి రెండు సంతానాలకు కూడా వర్తిస్తుంది.

వధువు  18 సంవత్సరాలు, వరుడు 21 సంవత్సరాల చట్టబద్దమైన వయస్సు నిండిన వారికి మాత్రమే ఈ బంగారు పథకం వర్తిస్తుంది.

జనన ధృవీకరణ పత్రం, వైద్య పరీక్షల ద్వారా వయస్సు నిర్ధారణ చేయబడుతుంది.

also read విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా బంపర్ ఆఫర్‌.. టికెట్‌ ధరలో 50 శాతం డిస్కౌంట్.. ...

పెళ్లి సమయంలో బంగారాన్ని అందించడం ఆచారం ఉన్న రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన వధువులకు ప్రభుత్వం 'ఒక తులం బంగారం' ఇస్తుంది.

వధువు, వరుడు వారి వివాహన్ని ప్రత్యేక వివాహ చట్టం, 1954 కింద నమోదు చేసుకోవాలి.

దరఖాస్తుదారులు వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా అదే రోజున అరుంధతి బంగారు పథకం ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుదారులు వారి మొదటి వివాహం కోసం మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

రాష్ట్రంలోని ఆదివాసీ వర్గాలతో సహా టీ ట్రైబ్ మినహా వధువు, వరుడు ఇద్దరూ కనీసం హెచ్‌ఎస్‌ఎల్‌సి లేదా సమానమైన ఉత్తీర్ణులై ఉండాలి.

వచ్చే ఐదేళ్ళ వరకు ఆదివాసీ వర్గాలతో సహా టీ ట్రైబ్ వారిలో కనీస విద్యా అర్హత అవసరం లేదు, ఎందుకంటే అస్సాం రాష్ట్రంలోని చాలా టీ గార్డెన్స్ లో హైస్కూల్ సౌకర్యం లేదు.