డిఫరెంట్ లుక్, స్టైల్ తో మార్కెట్లోకి కొత్త లిమిటెడ్ ఎడిషన్ బైక్: 7సెకన్లలో సూపర్ స్పీడ్..
అల్ట్రావయోలెట్ ఎఫ్77ను హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ గా పరిచయం చేసింది. F77 స్టాండర్డ్ వేరియంట్ కంటే ఎక్కువ శక్తిని, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిఫరెంట్ లుక్, స్టైల్ కోసం కలర్ స్కీమ్ కూడా ఇచ్చారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ తాజాగా ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రావయోలెట్ ఎఫ్77ను రూ. 3.8 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. కంపెనీ దీనితో పాటు F77 లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా పరిచయం చేసింది. లిమిటెడ్ ఎడిషన్ కోసం కేవలం 77 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆన్‌లైన్‌లో బుకింగ్ విండో ఓపెన్ చేసిన రెండు గంటలలో లిమిటెడ్ ఎడిషన్ అల్ట్రావయోలెట్ F77 బుక్ అయ్యాయి.
ధర
అల్ట్రావయోలెట్ ఎఫ్77ను హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ గా పరిచయం చేసింది. F77 స్టాండర్డ్ వేరియంట్ కంటే ఎక్కువ శక్తిని, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిఫరెంట్ లుక్, స్టైల్ కోసం కలర్ స్కీమ్ కూడా ఇచ్చారు. Ultraviolette లిమిటెడ్ ఎడిషన్ F77 ధరను మాత్రం ప్రకటించలేదు. ఈ ఎడిషన్ రూ. 4.55 లక్షల ఎక్స్-షోరూమ్ ధర ఉన్న ఎఫ్77 రీకాన్ కంటే ఎక్కువ ఉండొచ్చు.
అల్ట్రావయోలెట్ F77 మూడు వెర్షన్లలో ప్రవేశపెట్టారు అంటే F77, F77 Recon అండ్ F77 లిమిటెడ్ ఎడిషన్.
వీటి ఎక్స్-షోరూమ్ ధరలు:
అల్ట్రావయోలెట్ F77 ధర - రూ. 3,80,000
అల్ట్రావయోలెట్ F77 Recon ధర - రూ. 4,55,000
పవర్ అండ్ స్పీడ్
ఈ లిమిటెడ్ ఎడిషన్ అల్ట్రావయోలెట్ F77 40.2 bhp (30.2 kW) అండ్ 100 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7.8 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు, దీని టాప్ స్పీడ్ 158 kmph. F77 అండ్ F77 రీకాన్ వేరియంట్‌లు 38.8 bhp (29 kW), 95 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. టాప్ స్పీడ్ 147 kmph, 8 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకుంటుంది.
బ్యాటరీ అండ్ మైలేజ్
F77 లిమిటెడ్ ఎడిషన్ పెద్ద 10.3 kWh బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 306 కిమీ (IDC సర్టిఫైడ్) మైలేజ్ అందిస్తుంది. స్టాండర్డ్ AC ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని 7 నుండి 8 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ తో ఒక గంటలో బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.
వేరియంట్‌లు అండ్ రైడింగ్ మోడ్‌లు
అల్ట్రావయోలెట్ F77ను ఎయిర్‌స్ట్రైక్, షాడో అండ్ లేజర్ అనే మూడు వేరియంట్‌లలో పరిచయం చేసింది. ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి - గ్లైడ్, కంబాట్ అండ్ బాలిస్టిక్. ఈ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ ఉత్పత్తి గ్లోబల్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. బెంగళూరులోని అల్ట్రావయోలెట్ రీసర్చ్ అండ్ అభివృద్ధి కేంద్రంలో F77 అభివృద్ధి చేయబడింది.
ఫీచర్స్
అడ్జస్ట్ చేయగల 41ఎంఎం USD ఫ్రంట్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్, బ్రేకింగ్ డ్యూటీస్ ఫోర్-పిస్టన్ కాలిపర్‌లతో 320ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో 230 ఎంఎం బ్యాక్ డిస్క్ బ్రేక్ , డ్యూయల్-ఛానల్ ABS, 5-అంగుళాల TFT స్క్రీన్ అండ్ జియోఫెన్సింగ్, వెహికల్ లొకేటర్, రైడ్ అనలిటిక్స్, క్రాష్ డిటెక్షన్ వంటి చాలా ఫీచర్లు ఉన్నాయి.
అల్ట్రావయోలెట్ F77 డెలివరీలు జనవరి 2023లో బెంగళూరు నుండి ప్రారంభం కానున్నాయి. తరువాత ఇతర నగరాలకు విస్తరిస్తాయి. Ultraviolette బైక్ ని యూరప్, ఉత్తర అండ్ దక్షిణ అమెరికా, జపాన్, ఆగ్నేయాసియా వంటి మార్కెట్‌లలో కూడా విక్రయించాలని యోచిస్తోంది.