Asianet News TeluguAsianet News Telugu

కొత్త ఎలక్ట్రిక్ పికప్ ట్రక్‌ని పరిచయం చేసిన ఎం‌జి మోటార్స్.. దీనిలో ఇన్ని బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయా..

ఎం‌జి మోటార్స్ ద్వారా ఆస్ట్రేలియన్ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కు పరిచయం చేసారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్‌టెండర్ థాయిలాండ్‌లోని కొన్ని మార్కెట్‌లలో విక్రయించబడుతుంది. 

Tmg his company introduced electric pickup truck, know what is the range and features
Author
First Published Nov 28, 2022, 5:43 PM IST

కార్ల తయారీ సంస్థ ఎం‌జి మోటార్స్  ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ ET60ని ఆస్ట్రేలియాలో పరిచయం చేసింది. ఈ ట్రక్కులో కంపెనీ అత్యుత్తమ మోటార్ అండ్ బ్యాటరీని అందించింది. దీని కారణంగా సైజ్ లో పెద్దదిగా ఉండటమే కాకుండా బెస్ట్ మైలేజ్ ఇస్తుంది.  ఈ ట్రక్కు ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి...

ఎక్కడ ప్రవేశపెట్టారు
ఎం‌జి మోటార్స్ ద్వారా ఆస్ట్రేలియన్ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కు పరిచయం చేసారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్‌టెండర్ థాయిలాండ్‌లోని కొన్ని మార్కెట్‌లలో విక్రయించబడుతుంది. దీని ఎలక్ట్రిక్ వెర్షన్ ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు.  

ప్రత్యేకత ఏమిటి
ఎలక్ట్రిక్ ఎం‌జి T60 ఫీచర్ల గురించి మాట్లాడితే సింగిల్ జోన్ AC ఇందులో ఇచ్చారు. దీనితో పాటు, ఆటో హెడ్‌లైట్లు, వైపర్‌లు, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల ఫ్రంట్ సీట్లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ సపోర్ట్, నాలుగు స్పీకర్లు, రివర్స్ కెమెరా, LED టైల్‌లైట్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్, ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, ESP వంటి ఎన్నో ఫీచర్లు ఇచ్చారు.  
బ్యాటరీ ఎలా ఉంది

ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ గురించి చెప్పాలంటే, ఇందులో అందించిన బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 330 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దీనిని AC అండ్ DC రెండు మోడ్‌లలో ఛార్జ్ చేయవచ్చు. AC ఛార్జర్ ద్వారా పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు తొమ్మిది గంటల సమయం పడుతుంది.  80 kW ఛార్జర్‌తో 20 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 45 నిమిషాలు మాత్రమే పడుతుంది.

ధర 
ఆస్ట్రేలియా మార్కెట్‌లో దీని ధర భారతీయ కరెన్సీలో చూస్తే దాదాపు రూ.51 లక్షలు.

ఆసియాలో పికప్ ట్రక్కులు  చాలా పాపులర్ 
భారతదేశంతో సహా ఆసియా ప్రాంతం అంతటా పికప్ ట్రక్కులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇంకా సౌత్ ఈస్ట్ దేశాలలో మరింత ప్రాచుర్యం పొందింది. ఈ దేశాల్లో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వేరియంట్ మాత్రమే విక్రయించబడింది. దీన్ని ఎక్కువగా సరుకు రవాణా కోసం తీసుకొచ్చే వ్యాపారులకు మంచి ఆప్షన్. ఆస్ట్రేలియాలో ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చిన తర్వాత, త్వరలో భారతదేశంతో సహా ఇతర సౌత్ ఈస్ట్ ఆసియన్ దేశాలకు తీసుకురాబడుతుందని భావిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios