Asianet News TeluguAsianet News Telugu

రూ.11వేలు చెల్లిస్తే రెనాల్ట్ ట్రైబర్ బుకింగ్.. మారుతి, హ్యుండాయ్, ఫోర్డ్‌లకు సవాల్


మారుతి స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో, ఫ్రీస్టైల్, హ్యుండాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వగలదని భావిస్తున్న రెనాల్ట్ ట్రైబర్ కారు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 28వ తేదీన విపణిలోకి అడుగు పెట్టనున్నది. 

RenaultTriber bookings to begin from17 August launch on 28 August
Author
Mumbai, First Published Aug 15, 2019, 1:11 PM IST

ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్‌ ఈ నెలాఖరులో విపణిలోకి విడుదల చేయనున్న ‘ట్రైబర్’ కారు బుకింగ్‌లను ప్రారంభించింది. కాంపాక్ట్ ఎంపీవీ క్రాస్ఓవర్, ట్రైబర్ అధికారిక బుకింగ్‌లను ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభిస్తామని రెనాల్ట్ ప్రకటించింది. 

రెనాల్ట్ వెబ్‌సైట్‌లో గానీ, దగ్గరిలోని బ్రాండ్ డీలర్‌ ద్వారా గానీ రూ.11,000  చెల్లించి ప్రీ బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.ఈ కార్‌ ధరలు సుమారు రూ. 5 - రూ. 7 లక్షల మధ్యన ఉంటుందని అంచనా. ఈ నెల 28వ తేదీన రెనాల్ట్‌ ట్రైబర్‌ మోడల్ కారు విపణిలో అడుగిడనున్నది.

రెనాల్ట్ ట్రైబర్‌లో 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ యూనిట్, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇంకా 72 బిహెచ్‌పీ పవర్‌, 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ , 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ అప్షన్స్‌లలో రానుంది. ట్రైబర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డ్రిల్స్, రూఫ్ స్పోర్టివ్ లుక్‌తో వస్తున్న ఈ కారులో మూడో వరుసలో ఉన్న సీట్లను అవసరం లేకపోతే.. పూర్తిగా తొలగించుకునే అవకాశం కల్పించింది.  

మారుతి స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో, ఫ్రీస్టైల్, హ్యుండాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ లాంటి వాటికి రెనాల్ట్‌ ట్రైబర్‌ గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. భద్రతా ఫీచర్ల విషయానికొస్తే, రెనాల్ట్ ట్రైబర్ లో 4 ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్, ట్విన్ ఎయిర్ బ్యాగులు, స్పీడ్ అలర్ట్ లు, సీట్ బెల్ట్ రిమైండర్‌, రివర్స్ పార్కింగ్ కెమెరాను జోడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios