Asianet News TeluguAsianet News Telugu

కార్లలో వస్తున్న ఈ కొత్త సిస్టమ్ గురించి తెలుసా.. ఎలా పని చేస్తుందంటే..?

ప్రస్తుతం, ADAS వంటి భద్రతా ఫీచర్లు చాలా కార్లలో ఇచ్చారు. ఈ ఫీచర్‌తో పాటు లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ కూడా అందిస్తున్నారు. ఈ సిస్టమ్ రోడ్లపై ప్రమాదాలను నివారించడానికి సహాయపడుతుంది.

Lane Departure feature In Car: Know What Are its Benefits
Author
First Published Dec 15, 2022, 12:16 PM IST

కొత్త-జనరేషన్  కార్లలో భద్రతకు సంబంధించి కార్ల కంపెనీలు ఎన్నో ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ ఫీచర్స్ కారణంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ సౌకర్యం ఇంకా ప్రమాదాల నుండి మరింత రక్షణ కూడా ఉంటుంది.  మీరు సాధారణంగా కార్లలో లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ గురించి వినే ఉంటారు. ఈ ఫీచర్ కారులో ఎలా పని చేస్తుందో మీకు తెలుసా, దీని ప్రయోజనాలు ఏమిటో  తెలుసా..

లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ అంటే ఏమిటి
ప్రస్తుతం, ADAS వంటి భద్రతా ఫీచర్లు చాలా కార్లలో ఇచ్చారు. ఈ ఫీచర్‌తో పాటు లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ కూడా అందిస్తున్నారు. ఈ సిస్టమ్ రోడ్లపై ప్రమాదాలను నివారించడానికి సహాయపడుతుంది.

ఎలా పని చేస్తుందంటే 
ఈ ఫీచర్‌తో కూడిన కార్లు రోడ్డు పై  టు వే అంటే రోడ్డుని మధ్యలో విభజించే తెలుపు లేదా పసుపు గీతలు ఉన్న రోడ్లపై నడపడానికి సహాయపడతాయి. అప్పుడు ఈ సిస్టమ్ దాని పనిని ప్రారంభిస్తుంది. రోడ్డుపై కదులుతున్నప్పుడు ఈ ఫీచర్ లైన్‌లను స్కాన్ చేస్తుంది ఇంకా ఏదైనా కారణం చేత కారు ఈ లైన్‌లకు చాలా దగ్గరగా వచ్చినప్పుడు అలారం ద్వారా డ్రైవర్‌కు తెలియజేస్తుంది.

దీని ద్వారా లాభం ఏంటి 
కారులో లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్‌ ఉండటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. కారు లేన్‌ మారి లేదా లేన్ నుండి వదిలి ఇతర లేన్‌లోకి వెళ్లినప్పుడు డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది, తద్వారా ఇతర వాహనాలను ఢీకొనే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఏ కార్లు ఈ ఫీచర్‌ పొందుతాయి
ఈ సేఫ్టీ ఫీచర్ భారతదేశంలోని చాలా కార్లలో ఇచ్చారు. ఈ కార్లలో ఎం‌జి గ్లోస్టర్, ఎం‌జి ఆస్టర్, మహీంద్రా ఎక్స్‌యూ‌వి700, హోండా సిటీ, హ్యుందాయ్ టక్సన్ వంటి కార్లు ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios