Asianet News TeluguAsianet News Telugu

లంబోర్ఘిని కొత్త సూపర్‌ ఫాస్ట్ కార్.. 3 సెకండ్లలో అదిరిపోయే స్పీడ్.. ఎలాంటి రోడ్లలోనైనా నడపడం చాలా ఈజీ..

లాంబోర్ఘిని  ఉరుస్ పెర్ఫార్మంటే గ్లోబల్ లాంచ్ చేసిన మూడు నెలలకే భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ సూపర్ SUV భారతదేశంలో తాజాగా ప్రవేశపెట్టారు. 

Italian supercar maker Lamborghini has launched the Urus Performante in the Indian market.
Author
First Published Nov 26, 2022, 1:51 PM IST

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారత మార్కెట్లోకి ఉరుస్ పెర్ఫార్మంటేను లాంచ్ చేసింది. అద్భుతంగా రూపొందించిన ఈ సూపర్‌ ఎస్‌యూవీలో కంపెనీ ఎన్నో మార్పులు చేసింది, ఇంతకుముందు కంటే ఇప్పుడు మరింత పవర్ ఫూల్. చాలా ప్రత్యేకమైన ఫీచర్లతో పాటు కారుకు కొత్త డ్రైవింగ్ మోడ్ కూడా అందించారు, దీని వలన ఈ ఎస్‌యూ‌విని ఏ రకమైన రోడ్డులోనైనా నడపడం చాలా సులభం. ఈ సూపర్ SUV ధర, ఫీచర్ల గురించి  తెలుసుకొండి...

గ్లోబల్ లాంచ్  తర్వాత మూడు నెలలకు
లాంబోర్ఘిని  ఉరుస్ పెర్ఫార్మంటే గ్లోబల్ లాంచ్ చేసిన మూడు నెలలకే భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ సూపర్ SUV భారతదేశంలో తాజాగా ప్రవేశపెట్టారు. దీనిలో సాధారణ ఉరుస్‌తో పోల్చితే ఎన్నో మార్పులు చేసారు , దీని కారణంగా ఈ SUV మెరుగ్గా మారింది.

డిజైన్ ఎలా ఉందంటే 
ఉరుస్ పెర్ఫార్మంటే డిజైన్ గురించి మాట్లాడితే అందులో కార్బన్ ఫైబర్ ఉపయోగించారు. ఎక్స్టీరియర్ డిజైన్ లో ముందు నుండి వెనుకకు కార్బన్ ఫైబర్ ఉపయోగించిన విధానం ఎస్‌యూవీకి చాలా అగ్రెసివ్ లుక్‌ని ఇస్తుంది. ఇంకా కొత్త బ్లాక్ ఎయిర్ ఇన్‌టేక్ కూడా పొందుతుంది, ఇది కారు ఇంజిన్‌ను ఇంతకుముందు కంటే మెరుగ్గా చల్లబరుస్తుంది. ఇంకా కార్ బరువు కూడా 47 కిలోలు తగ్గింది. అద్భుతమైన ఏరోడైనమిక్ డిజైన్ కారణంగా  ఎంత గొప్పగా కనిపిస్తుందో, అంతే  త్వరగా స్పీడ్ పుంజుకుంటుంది. కార్బన్ ఫైబర్ బ్యాక్ స్పాయిలర్‌పై కూడా ఉపయోగించారు.

ఇంటీరియర్ ఎలా ఉందంటే 
ఈ సూపర్ కార్ SUV లోపలి భాగం కూడా చాలా స్సింపుల్ గా ఉంచారు. నీరో కాస్మోస్ బ్లాక్ ఆల్కాంటారా లెదర్ ఇందులో స్టాండర్డ్‌గా ఉపయోగించారు. అలాగే హెక్సాగొనల్ కుట్టడం జరిగింది. డ్యాష్‌బోర్డ్ నుండి కారు సీట్ల వరకు చాలా దగ్గరగా రూపొందించారు. అయితే, ఈ SUVని కొనే కస్టమర్ టెస్ట్  ప్రకారం, కంపెనీ డిజైన్, కలర్ మొదలైన వాటిలో మార్పులు చేయవచ్చు. కానీ స్టాండర్డ్‌గా SUVకి డార్క్ థీమ్ ఇచ్చారు.

ఫీచర్స్ 
ఈ సూపర్ SUV గొప్ప ఫీచర్లతో అందిస్తున్నారు. ఇంకా మధ్యలో రెండు పెద్ద స్క్రీన్లు ఇచ్చారు. ఇందులో ఒక స్క్రీన్‌కు కారుకు సంబంధించిన పూర్తి సమాచారం అండ్ కంట్రోల్స్, మరొక స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసంఇచ్చారు. SUV హెడ్‌లైట్‌లను ఆటో మోడ్‌లో కూడా ఉంచవచ్చు. అంతేకాకుండా, 360 డిగ్రీ కెమెరా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ అలాగే డిజిటల్ MID, ఫ్రేమ్-లెస్ డోర్, రియర్ AC వెంట్స్, నాలుగు USB పోర్ట్‌లు, అద్భుతమైన సౌండ్ సిస్టమ్, బ్యాక్ సీటు కోసం రూఫ్ లైట్లు వంటి ఎన్నో ఫీచర్లు ఇచ్చారు.

స్పెషల్ డ్రైవింగ్ మోడ్‌
ఉరుస్ పెర్ఫార్మంటేలో కంపెనీ నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను అందించింది. వీటిలో Strada, Sport, Corsa మోడ్‌లు కూడా సాధారణ ఉరుస్‌లో కూడా ఉంటాయి, అయితే దీనికి మరో ప్రత్యేక డ్రైవింగ్ మోడ్ Rally కూడా ఇచ్చింది. ర్యాలీ మోడ్‌లో SUVని డర్ట్ ట్రాక్‌లపై కూడా సులభంగా నడపవచ్చు. ఈ SUV అన్ని రకాల రోడ్లపై స్మూత్ గా నడిచేలా రూపొందించబడింది.

ఇంజిన్
ఈ కొత్త సూపర్ SUV ఇంజిన్ చాలా శక్తివంతమైనది. ఉరుస్ పెర్ఫార్మంటేలో కంపెనీ నాలుగు-లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజన్‌ని అందించింది. ఈ కారణంగా  666 బిహెచ్‌పి, 850 న్యూటన్ మీటర్ల టార్క్‌ ఇస్తుంది. ఈ SUV సాధారణ ఉరస్ కంటే 16 bhp ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 306 kmph, కేవలం 3.3 సెకన్లలో సున్నా నుండి 100 kmph స్పీడ్  అందుకుంటుంది. దీని బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇంత హై స్పీడ్ ని కంట్రోల్ చేసేలా డిజైన్ చేసారు. 100 కి.మీ స్పీడ్ తో బ్రేకులు వేసిన 32.9 మీటర్లలో పూర్తిగా కారుని ఆపేయవచ్చు.

ధర
ఈ సూపర్ SUV ధరను కంపెనీ రూ. 4.22 కోట్ల ఎక్స్-షోరూమ్‌గా తెలిపింది. భారతీయ మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ DBX 707, పోర్షే కయెన్నే కూపే టర్బో GT, మసెరటి ట్రోఫియో, బెంట్లీ, ఫెరారీ అండ్ ఆడి R8 వంటి సూపర్ కార్లతో పోటీపడుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios