మహేష్ బాబు త్వరలో చిరంజీవి చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై అధికారికంగా ఏ వార్త రాలేదు. కానీ మాటలు మాత్రం జరిగాయని, డేట్స్, రెమ్యునరేషన్ విషయం మాట్లాడుతున్నారని తెలుస్తోంది.సినిమాలో మహేష్ చెయ్యాల్సిన పాత్ర ఇరవై నిముషాలు ఉండబోతోందని,చరణ్ తో మొదట చెయ్యిద్దామని కొరటాల శివ అనుకున్నారని, అయితే మహేష్, చిరు కాంబినేషన్ అయితే ఇంకా క్రేజీగా ఉంటుందని భావించిన రామ్ చరణ్ ...