జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించారు. ఈ నిర్ణయం చాలా కంపెనీలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు ఒక ఆదాయ వనరుగా కూడా మారనుంది. ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధం కారణంగా నాన్ వోవెన్ బ్యాగ్‌లకు (Non Woven Bag) డిమాండ్ పెరిగింది. Non Woven Bag ల తయారీకి భారీ పెట్టుబడి అవసరం లేదు, కేవలం చిన్న పెట్టుబడి పెడితే చాలు, ప్రతినెలా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. Non Woven Bag తయారీ యూనిట్ ద్వారా మీరు మీ స్వంత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో తెలుసుకుందాం.