ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. కళాకారులకు అనుకూల సమయంగా ఉంటుంది. సామాజిక గౌరవం తగ్గిపోతుంది. దానివల్ల వచ్చే సమస్యలు అధికం అవుతాయి. ఊహించని ఇబ్బందులు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. విద్యార్థులకు ఉన్నత చదువులకు అవకాశం పెరుగుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. తమకంటే పెద్దవారితో జాగ్రత్తగా మెలగాలి. వారి అనుభూతులు ఎప్పటికప్పుడు వింటూ, వారి జ్ఞానాన్ని పంచుకునే దిశగా వీరు ప్రయత్నం చేయాలి. 

అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం తప్పనిసరి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. సేవకులతో కొంత కొంత అనుకూలత ఏర్పడుతుంది. వీరు పనిచేసే చోట తోటి వారితో జాగ్రత్తగా మెలగాలి. తొందరపడి ఏ పనులు చేయకూడదు. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల్లో కొంత జాప్యం ఏర్పడుతుంది.

వీరు మౌనాన్ని పాటించాలి. మాట వల్ల అపార్థాలు ఎక్కువగా వచ్చే సూచనలు ఉంటాయి. చేసే పనుల్లో ఆశలు అధికం అవుతాయి. అన్ని పనుల్లోనూ స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. తమ ప్రయోజనాలవైపు దృష్టి పెరుగుతుంది.

ఇది కూడా చదవండి..Aries:2020లో మేషరాశి ఫలితాలు..

మాటల్లో తొందరపాటు పనికిరాదు. ఎక్కువగా వినడం తక్కువగా మాట్లాడడం మంచిది. కుటుంబ, సామాజిక అనుబంధాలు మాటలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఆర్థిక నిల్వలు కోల్పోయే సమయం. అనవసర ఖర్చులు ఉంటాయి. సెప్టెంబర్ తరువాతశ్రమ అధికం అవుతుంది. పనులకు అనుగుణాం ప్రణాళికలు మార్చుకోవాలి.

ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. వైద్యశాలలు, పరామర్శలు అధికం అవుతాయి. సెప్టెంబరు తర్వాత నుంచి సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. ఏ పనిచేసినా, నిరాశ, నిస్పృహలు ఉంటాయి. పనుల్లో జాప్యం ఉంటుంది. అనుకున్నంత సంతృప్తి ఉండదు. ఎక్కువ ఆశలు, ఆశయాలు పెంచుకోకపోవడం మంచిది. దూర దృష్టి ఉంటుంది. ఊహలు అధికంగా ఉంటాయి.

డా.ఎస్.ప్రతిభ