Asianet News TeluguAsianet News Telugu

22 అక్టోబర్ 2018 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today oct22nd your horoscope
Author
Hyderabad, First Published Oct 22, 2018, 9:41 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పరిశోధకులకు ఒత్తిడి సమయం ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగే సూచనలు ఉంటాయి. ఇతరులపై ఆధారపడతారు. సంతృప్తి లోపిస్తుంది.  శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనుకోని కష్టాలు ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. చెడు మార్గాలపై దృష్టి ఏర్పడుతుంది. అనారోగ్య సూచనలుటాంయి. ఇతరులపై ఆధారపడతారు. క్రయ విక్రయాలవల్ల ఇబ్బందులు.  శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.   భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఎక్కువఅవుతుంది. ఊహించని ఇబ్బందులుటాంయి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీర శ్రమ అధికం. గుర్తింపుకోసం ప్రయత్నిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. ఋణ సంబంధ ఆలోచనల్లో ఉన్నతి ఏర్పడుతుంది. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. సంతృప్తి లభిస్తుంది.  శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. సంతానం వల్ల సమస్యలు ఉంటాయి. కళాకారులకు ఒత్తిడి సమయం. సృజనాత్మకతను కోల్పోతారు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆత్మీయతను కోల్పోతారు.  విద్యార్థులు అధిక శ్రమతో మధ్యమ ఫలితాలు.  శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. వాహనాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు కష్టకాలం. ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు. ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సేవకుల సహకారం లభిస్తుంది. దగ్గర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం ఉంటుంది. పనుల్లో ఒత్తిడులు తగ్గించుకునే అవకాశం. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. సమీప వ్యక్తులతో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామజయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వాగ్దానాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఆటంకాలు ఉంటాయి. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాటవల్ల కష్టాలు వచ్చే సూచనలు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులు పూర్తి చేయడంలో అధిక శ్రమ ఉంటుంది. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఆశయాలకు తగిన అభిరుచులు ఉంటాయి. బద్ధకాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. ఉద్యోగాలలో ఆచి, తూచి వ్యవహరించాలి. సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. రాచకార్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది.  శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సేవకుల ద్వారా ఆదాయ మార్గాలు ఉంటాయి. పెద్దలంటే గౌరవ మర్యాదలు. కళాకారులకు అనుకూల సమయం. సమిష్టి ఆశయాల సాధన చేస్తారు. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది.  శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. సుఖంకోసం ఆరాటపడతారు. దేహసౌఖ్యం లోపిస్తుంది. శారీరక శ్రమ అధికం. పాదాల నొప్పులు ఉంటాయి. అన్ని రకాల ఖర్చులు చేస్తారు. అనవసర వ్యయాలు. ఇతరులపైఆధారపడతారు.  శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios