22నవంబర్ 2018 గురువారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత. భాగస్వామ్య ఒప్పదాల్లో ఒత్తిడి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. పరామర్శలు ఉంటాయి. సంఘంలో గౌరవం ఏర్పడుతుంది. వ్యాపార ధోరణి పెరుగుతుంది. కళారంగంపై ఆసక్తి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోీల్లో గెలుపుకై ఆరాటం. శతృవులపై విజయానికి తపన పడతారు. అనారోగ్య భావన ఉంటుంది. రోగనిరోధక శక్తిని కోల్పోతారు. ఔషధసేవనం తప్పనిసరి. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఋణాల విషయంలో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సృజనాత్మకత ఏర్పడుతుంది. లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉన్నతవిద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విహార యాత్రలు చేయాలనే ఆలోచన ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. గృహంలో అలంకరణలపై దృష్టి పెడతారు. మాతృ సౌఖ్యం లభిస్తుంది. విలాసవంతమైన ఆలోచనలు ఉంటాయి. సుగంధద్రవ్యాలపై ఆసక్తి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విద్యార్థులకు అనుకూల సమయం. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాల సాధన ఉంటుంది. ప్రసార సౌకర్యాలు ఉంటాయి. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పరామర్శలు జరుగుతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం. నిల్వ ధనం పెంచుకోవాలనే ఆలోచన. మానసిక ప్రశాంతత ఉంటుంది. సంతానం వల్ల సంతోషం ఏర్పడుతుంది. కళలపై ఆసక్తి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. శారీరక శ్రమతో చాలా పనులు సాధిస్తారు. కళాత్మకంగా వ్యవహరిస్తారు. ఆకర్షణశక్తి పెరుగుతుంది. పట్టుదలతో కార్య సాధన శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : కళలపై ఆసక్తి. కళాకారులకు అనుకూల సమయం. విలాసాలకోసం ఖర్చులు. విహార యాత్రలపై దృష్టి. విశ్రాంతి లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. పట్టుదలతో కార్య సాధన. దూర ప్రయాణాలు చేస్తారు. అన్ని రకాల ఖర్చులు అధికం. ఇతరులపై ఆధారపడతారు. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి. కళా నైపుణ్యం పెరుగుతుంది. సమిష్టి కార్య కలాపాలు సాగుతాయి. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. దురాశ ఉంటుంది. ఇతరులపై ఆధారపడడం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలతలు. అధికారులతో సంతోషం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకై ఆరాటం. రాజకీయ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సామాజిక అభివృద్ధి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శుభకార్యాల్లో పాల్గొంటారు. సజ్జన సాంగత్యం ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ఉన్నత విద్యల ద్వారా గుర్తింపు లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనల్లో చికాకులు ఏర్పడతాయి. అనారోగ్య భావనలు ఉంటాయి. చెడు మార్గాలపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడడం. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.