05జులై 2019 శుక్రవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలత ఉంటుంది. తోటివారితో సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్లు అనుకూలిస్తాయి. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం, ఫలితం తక్కువగా ఉంటుంది. జాగ్రత్త అవసరం. శ్రీ దత్త శ్శరణం మమ జపం మేలు చేస్తుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : తోటివారితో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులతో అప్రమత్తత అవసరం. పరాక్రమం తగ్గుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేయాలనే కోరిక ఉంటుంది. ఆ ఆశ తీరక ఇబ్బంది పడతారు. విద్యార్థులకు అధిక శ్రమతో తక్కువ ఫలితాల సూచన. శ్రీరామ జయరామ జయరామ జయజయరామరామ
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : బంగారు ఆభరణాలు కొనాలనే ఆలోచన పెరుగుతుంది. స్థిరాస్తులపై దృష్టి పెడతారు. నిల్వ ధనం పెంచుకుటాంరు. మాటల్లో చమత్కారం ఉంటుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. మధ్యవర్తిత్వాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకోని ఇబ్బందులు వస్తాయి. తొందరపాటు పనికిరాదు. ఒక పని చేసేముందు ఒకికి రెండు సార్లు ఆలోచన అవసరం. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం. పట్టుదలతో కార్యసాధన పూర్తిచేయాలి. లక్ష్మీ అష్టోత్తర పారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. ఆహారంలో సమయపాలన మంచిది. ఖర్చులు అధికంగా ఉంటాయి. విందు వినోదాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గం చూస్తారు. పెద్దలతో అనుకూలత ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులకు సరియైన సమయం.చేసే అన్ని పనుల్లోఆనందం ఉంటుంది. కళాకారులకు అనుకూల సమయం. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సంఘంలో గౌరవం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు పెంచుకునే సమయం. పెట్టుబడులు విస్తరిస్తాయి. రాజకీయాలపై దృష్టి పెడతారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. చేసే ఉద్యోగంలో సంతృప్తి లభిస్తుంది. శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ధనం అనవసర పనులకు వినియోగిస్తారు. విద్యార్థులకు శ్రమ అధికం. అనుకున్న ఫలితాలు సాధించలేరు. దూరదృష్టి వల్ల ఇబ్బందులు వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. పరిశోధకులకు కష్టకాలం. దూర ప్రయాణాలకై డబ్బు వెచ్చిస్తారు. సంతృప్తి తక్కువగా ఉంటుంది. శ్రీమాత్రేనమఃజపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు వస్తాయి. వ్యాపారస్తులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఉండకపోవచ్చు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. పరాశ్రయం ఉంటుంది. జాగ్రత్త అవసరం. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పరిచయాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు కలిసివచ్చే కాలం. పెట్టుబడుల్లో రాణింపు ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. సంతృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పోటీల్లో గెలుపుకై తపన ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలత. పెట్టుబడులు వ్యాపిస్తాయి. పోటీల్లో గెలుపు ఉంటుంది. శత్రువులపై విజయం ఉంటుంది. రోగనిరోధకశక్తి పెంచుకుటాంరు. శారీరకబలం అభివృద్ధి చెందుతుంది. సంతృప్తి లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విద్యార్థులు ఒత్తిడితో పనులు సాధన. అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాహనాల వల్ల ఇబ్బందులు. సౌకర్యాలు ఒత్తిడిని కలిగిస్తాయి. ఆహారంలో సమయ పాలన మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మాతృ సంబంధీకులతో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ