డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషం: ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ వత్తిడుల నుంచి బయటపడతారు. సోదరులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభం: ఈ రోజు అనుకోని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా వ్యవహరించి బయటపడతారు. వివాదాలు, ఇతరుల విషయాలకు దూరంగా దూరంగా ఉండటం ఉత్తమం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునం: ఈ రోజు ముఖ్యమైన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తువులు కొనుగోలు చేస్తారు. పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకం: ఈ రోజు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహం: ఈ రోజు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్య: ఈ రోజు బంధువులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన సన్నిహితుల సాయంతో పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. స్వల్ప ధనలాభం పొందుతారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తుల: ఈ రోజు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. వాహన సౌఖ్యం పొందుతారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికం: ఈ రోజు సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనస్సు: ఈ రోజు వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది . 
 
మకరం: ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. రుణ వత్తిడులు కొంత వరకు తీరుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభం: ఈ రోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో కలిసి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి అందిన ఓ కుటుంబంలో సంతోషానికి కారణమవుతుంది. సామాజిక కార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మీనం: ఈ రోజు దూర ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వస్తువులు కొనుగోలు చేస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.