Asianet News TeluguAsianet News Telugu

today astrology: 22 జులై 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యాపారాలు , ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. 

today dinaphalithalu 22nd july 2020
Author
Hyderabad, First Published Jul 22, 2020, 7:09 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 22nd july 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ముఖ్య పనుల్లో అవరోధాలు. బందువులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలలో  ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అయోమయ పరిస్థితి. ప్రయాణాలు రద్దు. అనారోగ్యం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు వ్యాపారాలలో అంచనాలకు తగిన లాభాలు. ఉద్యోగాలలో శుభవర్తమానాలు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో సంభాషణలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు ఉద్యోగాలలో అనుకోని మార్పులు. రాబడి కొంత తగ్గే అవకాశం. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు ముందుకు సాగవు. మిత్రులతో స్వల్ప విభేదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు వ్యాపారాలు , ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఉద్యోగాలలో కొన్ని చిక్కులు. ముఖ్యమైన పనుల్లో మందగమనం.  అనారోగ్యం. ప్రయాణాలు రద్దు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. కష్టానికి  ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలలో స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఉద్యోగాలలో ముఖ్యమైన మార్పులు. నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో లాభాలు దక్కే అవకాశం. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు మీ ఆశయాలు నెరవేరే సమయం. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.  ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. పరిచయాలు పెరుగుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు బంధువులతో కొన్ని వివాదాలు .ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగాలలో నిరాశ తప్పదు. కుటుంబంలో ఒత్తిళ్లు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో విభేదాలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలలో మరింత జాగ్రత్తలు వహించాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు వ్యాపారాలలో సత్తా చాటుకుంటారు. ఉద్యోగాలలో అనుకూలత. కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ముఖ్యమైన చర్చల్లో పురోగతి కనిపిస్తుంది. ఆస్తిలాభం.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. దైవదర్శనాలు. పనులు సకాలంలో పూర్తి. బంధువులతో సఖ్యత. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios