Asianet News TeluguAsianet News Telugu

today astrology:15 ఆగస్టు 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పర్యవేక్షణ లోపం లేకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు వహించండి. అనుకూల ఫలితాలున్నాయి. న్యాయంగా మీకు రావాల్సిన ధనాన్ని అందుకోగలుగుతారు. 

today dinaphalithalu 15th august 2020
Author
Hyderabad, First Published Aug 15, 2020, 7:08 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 15th august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 


మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు వినోద కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రుచికరమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. చిన్నపాటి వివాదాలను ఆదిలోనే పరిష్కరించుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు ప్రత్యర్థులను వ్యూహాలకు ప్రతి వ్యూహాలు అమలు చేస్తారు. పర్యవేక్షణ లోపం లేకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు వహించండి. అనుకూల ఫలితాలున్నాయి. న్యాయంగా మీకు రావాల్సిన ధనాన్ని అందుకోగలుగుతారు. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు సామాజిక సేవా కార్యక్రమాలకు గాను చందాలను వసూలు చేస్తారు. కళా సాంస్కృతిక రంగాల పట్ల అభిరుచిని కనబరుస్తారు. చేపట్టే పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. చర్చలు ఫలిస్తాయి. ప్రజాసంబంధాలు మరింతగా వృద్ధి చెందుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. సంఘటన మనస్తాపం కలిగిస్తుంది. అవసరాలకు సరిపడా ధనాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంతంలో నివసిస్తున్న మీ వారి యోగక్షేమాలను తెలుసుకుంటారు. లేనివారికి బట్టలు దానం చేయండి. అలసట పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఆహార ఆరోగ్య నియమాల పట్ల దృష్టిని సారించడం మంచిది. లాభనష్టాలను బేరీజు వేసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల సమయం. తోటివారి సహకారాలు అందుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. వాస్తవికత ప్రామాణికంగా అడుగులు ముందుకు వేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసుకు చికాకు పరుస్తుంది. దేవాలయాలను సందర్శిస్తారు. ఒత్తిడిని తగ్గించుకోవడానకి గాను బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తారు. శుభకార్య చర్చలను సాగిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోధైర్యంతో చేసే. దురలవాట్లకు స్వస్తి చెబుతారు. నిర్మాణాత్మక కార్యక్రమాల్లో చురుకుదనాన్ని తీసుకువస్తారు. లౌక్యంగా వ్యవహరించి కార్యక్రమాలను సానుకూల పరచుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు నిజాయితీగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన బరువు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన పంథాలో వినూత్న వ్యూహాలను అమలు పరుస్తారు. ఆత్మ విమర్శ చేసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు దీర్ఘాలోచనలు సాగిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. గోశాలలో గరిక దానం చేయడం ఉత్తమం. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. గృహసంబంధమైన విషయాల పట్ల దృష్టిని సారిస్తారు. సులభంగా కావాల్సిన పనులకు కూడా ప్రయాస పడాల్సి వస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు  స్థిరాస్తి వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. క్షణం తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు మీకు ఎంతమాత్రం సంబంధం లేని విషయాల పట్ల ఆసక్తిని ఉండదు. అవరోధాలున్నా ఆత్మబలంతో పోరాడి విజయం సాధిస్తారు. ధనధాన్యాభివృద్ధి కలదు. ప్రయాణాల్లో మెలకువలు అవసరం. సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు  ప్రత్యర్థి వర్గం మీ కంటే బలహీనంగా ఉండటం లాభిస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. గొప్పవారిని కలుస్తారు. రహస్య సమాచారం వెలుగు చూస్తుంది. మీ అభిప్రాయాలతో రాజీ ధోరణి ఏర్పడుతుంది. కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios