Asianet News TeluguAsianet News Telugu

today astrology: 14 ఆగస్టు 2020 శుక్రవారం రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి రుణాలు కొంతవరకు తీరుస్తారు. పాతమిత్రులను కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులను ఆనందంగా గడుపుతారు.

today dinaphalithalu 14th august 2020
Author
Hyderabad, First Published Aug 14, 2020, 7:12 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 14th august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 


మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు సన్నిహితుల నుంచి స్వల్ప ధనలాభం పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వాహనయోగం ఉంటుంది. స్వయం కృషితో విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో ఎదరైన ఆటంకాలు తొలుగుతాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. పాతమిత్రులను కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులను ఆనందంగా గడుపుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. సంఘసేవా కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. నూతన విద్యపై కలిగి ఉంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహనయోగం పొందుతారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకోని విధంగా ధన, వస్తులాభాలు పొందుతారు. అనవసర ప్రసంగాలు వద్దు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. సంఘ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల నుంచి సకాలంలో బయటపడతారు. మనోధైర్యంతో ముందుకు సాగి శుభఫలితాలు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. పరిమళగంధాన్ని ఉపయోగించండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ఆర్థిక లావాదేవీల్లో నిదానం అవసరం. మిత్రుల ద్వారా సమాచారం అందుకుంటారు. వాహనయోగం పొందుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో మెలకువ కలిగి ఉండాలి. ఓ శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. దైవబలం మిమ్మల్ని కాపాడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్దిపొందుతారు. వాహనాలు, స్థలాలు, గృహం కొనుగోలు యత్నాలు చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. అనుకోని అతిథులను కలుసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శారీరక శ్రమ పెరగవచ్చు. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలోని శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. నూతన మిత్రుల పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వస్తులాభం పొందుతారు. నూతన విద్యపై ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ప్రారంభించిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. మీ మీ రంగాల్లో లాభదాయకమైన ఫలితాలు సొంతం అవుతాయి. కొత్త వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత ఉంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios