today astrology: 12 ఏప్రిల్ 2020 ఆదివారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి లాభాలు సద్వినియోగం అవుతాయి. అన్ని రకాల ఆదాయాలు లభించే దిశగా ప్రణాళికలు వేసుకుంటారు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం అధికం చేస్తారు. అవి లభిస్తాయి. దర్శవంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు.
డా. ఎస్. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అధిక విశ్రాంతి లభిస్తుంది. విహార యాత్రలకై ఆలోచన పెరుగుతుంది. విందులు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపార ఖర్చులు అధికంగా పెట్టే ప్రయత్నం చేస్తారు. పాదాల నొపలు వచ్చే సూచనలు. తొందరపాటు పనికిరాదు.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : లాభాలు సద్వినియోగం అవుతాయి. అన్ని రకాల ఆదాయాలు లభించే దిశగా ప్రణాళికలు వేసుకుంటారు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం అధికం చేస్తారు. అవి లభిస్తాయి. దర్శవంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంఘంలో గౌరవంకోసం ఆరాటం అధికం అవుతుంది. ఉద్యోగస్తులనిర్ణయాలలో తొందరపాటును తగ్గించుకోవాలి. అధికారులతో అనుకూలత పెంచుకోవడం అవసరం. పనులు పూర్తి చేసుకునే విషయంపై ఆలోచన సాగిస్తారు.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పరిశోధనలవైపు పరుగులు తీస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పట్టుదల అధికం అవుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. విహార యాత్రలపై ఆలోచన పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. మొత్తంపై సంతోషంగా కాలం గడుపుతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. పరామర్శలు చేసే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. అనవసర ప్రయాణాలు కూడా ఉండే అవకాశం. శ్రమ లేని సంపాదనపై ఆలోచనలు పెరుగుతాయి. వైద్యశాలల సందర్శనం చేసే అవకాశం.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. భాగస్వాములతో తొందరపాటు పనికిరాదు. నూతన పరిచయాలు అనుకూలించే అవకాశం. వ్యాపారస్తులు కొంత అప్రమత్తంగా ఉండాలి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పోటీల్లో గెలుపు దిశగా ప్రయాణాలు సాగిస్తారు. ఊహించని పనుల భారం పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు అన్ని సమయాల్లో రాకపోవచ్చు. శత్రువులపై విజయానికి ఆలోచిస్తారు. రుణ సంబంధ ఆలోచనలు తీర్చే ప్రయత్నం చేస్తారు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సంతాన సమస్యలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతానంతో అనుకూలత పెంచుకుంటారు. క్రియేటివిటీ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేసే ప్రయత్నంలో ఉంటారు. ప్రణాళికాబద్ధమైన జీవితం గడిపడంపై ఆలోచిస్తారు.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సౌకర్యాలపై శ్రద్ధ చూపిస్తారు. సౌకర్యాల వల్ల సంతోషం కలుగుతుంది. విలాసవంతమైన ప్రయాణాలను చేస్తారు. ఆహారం సమయానికి తీసుకోవడం మంచిది. విద్యార్థులకు కొంత అనుకూలమైన సమయం. వాహన సౌకర్యాలు లభిస్తాయి.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వ్యాపార వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపార ప్రయాణాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. కమ్యూనికేషన్స్ విస్తరించుకుంటారు. మీడియారంగం వారికి అనుకూలం.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూలత పెంచుకుంటారు. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తొందరపాటు పనులు పనికిరావు. ఆచి, తూచి వ్యవహరించాలి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శ్రమ పెరుగుతుంది. అలంకరణలు చేసుకోవడంపై ఆలోచన పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఆవేశం ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలు తొందరగా అనుకూలించకపోవచ్చు. ఆచి, తూచి, వ్యవహరించాలి. తొందరపాటు పనికిరాదు.