డా. ఎస్‌. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. వృత్తి ఉద్యోగాదులలో తొందరపాటు పనికిరాదు. సేవకుల వలన అనుకూలత పెరుగుతుంది. సేవకులకోసం ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాల వల్ల ఒత్తిడి అధికం అవుతుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఉన్నత విద్యవలన కొంతశ్రమ అధికం అవుతుంది. పరిశోధకులకు అనుకున్న స్థాయిలో తమ పరిశోధనలు పూర్తి చేయలేరు. ప్రతీ విషయంలోనూ ఒత్తిడి అధికం అవుతుంది. చేసే పనుల్లో సంతృప్తి తక్కువగా ఉంటుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనవసర ఖర్చులు చేస్తారు. పరామర్శలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ఊహించని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత వహించడం మంచిది. ఆచి, తూచి అడుగులు వేయాలి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాలు తగ్గుతాయి. తొందరపాటు వ్యవహారాలు పనికిరావు. నూతన పరిచయాల వల్ల మోసపోయే అవకాశం పెరుగుతుంది. సామాజిక అనుబంధాల్లో కొంత అప్రమత్తత అవసరం. భాగస్వాములు జాగ్రత్తగా మెలగాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం అధికం చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపుకోసం ఆలోచన పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణసంబంధ అంశాలు తీర్చకునే అంశం గురించి ఆలోచిస్తారు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంతాన సమస్యలు అధికం అవుతాయి. క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం అవసరం అవుతాయి. కళాకారులకు అనుకూలత అంతగా ఉండదు. ఆచి, తూచి వ్యవహరించాలి.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాలకోసం అధికం ప్రయత్నం చేస్తారు. వాటివల్ల ఒత్తిడికి గురి అవుతారు. ప్రయాణాల వల్ల ప్రమాదాలు అధికం అవుతాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో శ్రమ అధికం అవుతుంది. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలున్నాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సేవకజన సహకారం పెరుగుతుంది. సేవకులతో అనుకూలత పెరుగుతుంది. వారితో పనులు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు కొంత ఒత్తిడికి గురి అయ్యే సూచనలు కనబడుతున్నాయి. తోటివారితో ఆచి, తూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మాటవల్ల అపార్థాలు పెరుగుతాయి. మధ్యవర్తిత్వాలు పనకిరావు. కుటుంబ సంబంధాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం లభిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. బద్ధకం తగ్గించుకునే ప్రయత్నం అవసరం. అన్ని పనుల్లోను తట్టుకుని నిలబడాలి. పనులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒకటికి, రెండుసార్లు ఆలోచించి పనులు పూర్తి చేస్తారు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం అధికం అవుతుంది. పాదాల నొప్పులు వస్తాయి. అనవసర ఖర్చలు చేస్తారు. అనవసర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వైద్యశాలల సందర్శనం చేస్తారు. తొందరపాటు పనులు పనికిరావు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. లాభాలు వచ్చినా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. లాభాలకోసం ఆరాటపడకుండా ఉండడం మంచిది. అన్ని పనుల్లో అనుకూలత పెంచుకోవాలి.