Asianet News TeluguAsianet News Telugu

08మే 2019 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు  ఇలా ఉన్నాయి

today 8th may 2019 your horoscope
Author
Hyderabad, First Published May 8, 2019, 7:12 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. అన్ని పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీ దత్త శ్శరణం మమ జపంమేలు.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మాటల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. చిత్త చాంచల్యం ఉంటుంది. వాగ్దానాలు నెరవేరవు. మాటల్లో కాఠిన్యత ఉంటుంది. కుటుంబ సంబంధాలు దూరమయ్యే అవకాశం. ఆర్థిక నిల్వలు తగ్గే సూచనలు. అనవసర ఖర్చులు ఉంటాయి. దానధర్మాలు మేలు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేయడంలో శ్రమ అధికంగా ఉంటుంది. ప్రణాళికలకు అనుగుణమైన పనులు జరగకపోవచ్చు. దగ్గరివారితో మాట ప్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మేలు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతి తక్కువౌతుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో ఒత్తిడులు ఉంటాయి. ఆహారంలో సమయ పాలన మంచిది. దగ్గరి వారు దౌరమయ్యే సూచనలు. పరామర్శలు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం ఉండవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీ దత్తశ్శరణం మమ జపం మేలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూలం ఉంటుంది. సోదరవర్గీయుల ద్వారా ఆదాయం వచ్చే సూచనలు. పెద్దలంటే గౌరవం ఇచ్చేసూచనలు. ప్రచార, ప్రసార సాధనాలు విస్తరిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పనుల్లో సంతృప్తి వస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వాికోసం ఆలోచిస్తారు. శ్రీదత్తశ్శరణం మమ జపంమేలు.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విద్యార్థులకు అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. విజ్ఞాన యాత్రలు చేసే ఆలోచనలు ఉంటాయి. సంతృప్తి తక్కువగా ఉంటుంది. పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉంటాయి. దూరపు ప్రయాణాలపై ఆశ పెరుగుతుంది. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఊహించని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ధనం, సమయం, కాలం కోల్పోయే సూచనలు కనబడుతున్నాయి. అనవసర ఖర్చులు చేస్తారు. దానధర్మాలు మేలు. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. నూతన పరిచయస్తులతో జాగ్రత్త అవసరం. మోసపోయే ప్రమాదం ఉంటుంది. పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీదత్తశ్శరణం మమ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పోటీల్లో గెలుపు సాధిస్తారు. శ్రమతో ఒత్తిడి తగ్గించుకుటాంరు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణసంబంధ ఆలోచనలు తీరుతాయి. విద్యార్థులు అనుకున్న పనులు పూర్తిచేయడంకోసం శ్రమ పడతారు. లక్ష్యాన్ని సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సంతాన సమస్యలు వచ్చే సూచనలు. సంతానంకోసం ఆలోచిస్తారు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక చికాకులు పెరిగే సూచనలు ఉన్నాయి. సృజనాత్మకత లోపిస్తుంది. కళాకారులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రీదత్తశ్శరణం మమ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సౌకర్యాలపై ఒత్తిడి పెరుగుతుంది. శ్రమతో సాధిస్తారు. సౌకర్యాలపై దృష్టి తగ్గించుకోవాలి. ఆహారంలో సమయపాలన అవసరం. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. గృహ సంబంధ లోపాలు ఉంటాయి. పొట్టసంబంధ లోపాలు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios