06మే 2019 సోమవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడితో ప్రమోషన్స్ వచ్చే సమయం. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు ఉండవు. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఓం నమో నారాయణాయ జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పరామర్శలు అధికంగా ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. అనవసర ప్రయాణాలు ఉంటాయి. అధికారిక ప్రయాణాలకై సమయాన్ని వెచ్చించాలి. ప్రయాణాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. తరువాత సుఖం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. మర్యాదను ఇచ్చుపుచ్చుకునే తత్వం కలిగి ఉంటారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అధికారిక లాభాలు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. లాభాలు, పెట్టుబడులు సంతోషాన్నిస్తాయి. సంతృప్తి ఉంటుంది. ఓం నమశ్శివాయ జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వృత్తిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. తమకంటే ఉన్నత ఉద్యోగస్తులతో ఆచి, తూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో ఒత్తిడి తప్పదు. అన్ని పనుల్లోనూ సంయమనం పాటించాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అధికారిక ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. పనుల్లోఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల్లో సంతృప్తి లభించదు. గురువులు, పెద్దలు మొదలైనవారిపై కోప తాపాలు తగ్గించుకోవాలి. ఆలోచనలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. నిరంతర జపం సాధన చేయాలి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అనుకోని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర పనుల జోలికి పోకపోవడం మంచిది. పరామర్శలు, వైద్యశాలల సందర్శనం ఉంటుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. పెట్టుబడులు విస్తరించకూడదు. నూతన పరిచయస్తులో అప్రమత్తంగా ఉండాలి. భాగస్వాములతో ఒత్తిడి ఏర్పడుతుంది. అందరితో కలిసిపోయే ప్రయత్నం చేయాలి. తొందరపాటు వ్యవహరాలు పనికిరావు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శ్రమానంతరం ఫలితం లభిస్తుంది. గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. శ్రమకు తట్టుకుని నిలబడే శక్తి కలిగి ఉంటారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమానంతరం మంచి ఫలితాలు ఉంటాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చిత్త చాంచల్యంతో పని చేస్తారు. సృజనాత్మకత కోల్పోతారు. సంతాన సమస్యలు అధికంగా ఉంటాయి. సంతానంకోసం ఆలోచన పెంచుకుటాంరు. అధికారులతో అప్రమత్తత అవసరం. సంతృప్తి తక్కువగా ఉంటుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సుఖం కోసం ఆరాటపడతారు. సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆహారంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. తల్లితండ్రులతో దూరంగా ఉంటారు. అధిక శ్రమ తరువాత సుఖం వచ్చినా అది అనుకున్న తృప్తిని ఇవ్వలేదు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అధికారుల సహకారం లభిస్తుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. తోటివారితో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి కలుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మాటల్లో అధికారిక ధోరణి కనిపిస్తుంది. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచన కనబడుతుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మాట విలువ తగ్గుతుంది. ఎక్కువసేపు మౌనంగా ఉండడం మంచిది. దానధర్మాలు మేలు. శ్రీ మాత్రేనమః జపం ఉపకరిస్తుంది.
డా.ఎస్.ప్రతిభ