28మే 2019 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 28th may 2019 your horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. శ్రమలేని సంపాదనకు అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. కడుపు సంబంధ వ్యాధులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇతరులపై ఆధారపడతారు. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వ్యాపారస్తులకు ఇబ్బంది ఉంటుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం కోసం పెరుగుతుంది. భాగస్వామ్య అనుబంధాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. శ్రీ దత్త శ్శరణం మమ జపం ఉపయోగపడుతుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. రోగనిరోధక శక్తి పెరచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. కార్యనిర్వహణ చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. ఋణ రోగాదులను అధిగమిస్తారు. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంతాన సమస్యలను అధిగమిస్తారు. లలితకళలపై ఆసక్తి పెరుగుతుంది.   పరిపాలనా సమర్ధత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. సృజనాత్మకత పెరుగుతుంది. అనురాగ, ఆత్మీయతలు పెంచుకునే సమయం. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గృహ వాహనాదులపై అధిక దృష్టి ఉంటుంది. వాటికోసం శ్రమ అధికంగా ఉంటుంది. ఆహారంలో సమయ పాలన మంచిది. అనారోగ్య భావనను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. గురువులతో పెద్దవారితో జాగ్రత్తగా మెలగడం మంచిది. సహకారం అనుకూలం. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. మధ్యవర్తిత్వాలు ఉపకరిస్తాయి. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అనుబంధాలు విస్తరిస్తాయి. పనుల్లో సంతోషం లభిస్తుంది. కుటుంబ సంబంధాలు విస్తరిస్తాయి. శ్రీదత్తశ్శరణం మమ.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  ఉద్యోగస్తులకు వేరే ప్రాంతాలకు తరలింపు ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో కూడిన గుర్తింపు ఉంటుంది. కొంత బద్ధకంగా ఉంటారు. పనుల్లోఆలస్యం అవుతుంది. పెద్దవారితో అనుబంధాలు పెంచుకుంటారు. పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీదత్తశ్శరణం మమ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు అనుకూలిస్తాయి. ధార్మిక ఖర్చులకు ధనం వినియోగిస్తారు. పరామర్శలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) :  పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పెద్దవారితో అనుకూల ఏర్పడుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. చేసే పనుల్లో సంతోషం లభిస్తుంది. అన్ని పనుల్లో లాభాపేక్ష ఉంటుంది. ఆహారంపై దృష్టి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలకు అవకాశం. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలపై ఆసక్తి పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూల ఉంటుంది. అధికారులతో అనుకూల సమయం. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సంతోషంగా ఉంటారు. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విహార యాత్రలకు అవకాశం ఉంటుంది. దూరదృష్టి ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. గురువుల దీవెనలు లభిస్తాయి. సంతృప్తి లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం బాగా ఉపకరిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios