today astrology:19 డిసెంబర్ 2019 గురువారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి : అనవసర ఖర్చులు చేస్తారు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. శ్రమకు తగిన గుర్తింపుకోసం ఆరాటపడతారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. దానధర్మాలు మేలు చేస్తాయి. ఆచి, తూచి వ్యవహరించాలి.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనుకోని ఇబ్బందులు వస్తాయి. పనులలో జాప్యం జరగవచ్చు. చేసే అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సంతృప్తికోసం ఆరాట పడతారు. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు. అనవసర తిరుగుడు ఉంటుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనవసర ఖర్చులు చేస్తారు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. శ్రమకు తగిన గుర్తింపుకోసం ఆరాటపడతారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. దానధర్మాలు మేలు చేస్తాయి. ఆచి, తూచి వ్యవహరించాలి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి పెరుగుతుంది. నూతన పరిచయస్తులతో అప్రమత్తంగా ఉండాలి. పాత మిత్రులు కలిసే అవకాశం. భాగస్వాములతో ఆచి, తూచి వ్యవహరించాలి. సమాజంలో అందరితో కలిసి మెలిసి మెలిగే ప్రయత్నంలో ఉండాలి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీలలో గెలుపుకై ప్రయత్నిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఋణసంబంధ ఆలోచనలు తీరుతాయి. ఉద్యోగస్తులలో అనుకూలత పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంతాన సమస్యలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. దానికోసం ఆరాటపడతారు. చిత్త చాంచల్యంతో ప్రణాళికలు వేస్తారు. క్రియేటివిటీ తగ్గతుంది. ఒత్తిడి అధికం అవుతుంది. అధికారులతో అనుకూలతకై ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌఖ్యంకోసం ఆరాటం పెరుగుతుంది. గృహసంబంధ విషయాల్లో ఒత్తడి పెరుగుతుంది. ఒత్తిడిత్తో సౌకర్యాలను పూర్తిచేస్తారు. ఆహారంలో సమయపాలన అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అధికారులతో అనుకూలత పెరుగుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. సహకారం లభిస్తుంది. ప్రయాణాలు సౌకర్యంగా చేస్తారు. ప్రచార, ప్రసార సాధనాలు లాభిస్తాయి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : నిల్వధనం కోల్పోతారు. అధికారులతో మాట విషయంలో జాగ్రత్త అవసరం. మాటల్లో కాఠిన్యత రాకుండా చూసుకోవాలి. కుటుంబ సంబంధాలు ఒత్తిడికి గురిచేస్తాయి. ధన సంపాదనకు ప్రయత్నం చేస్తారు. మధ్యవర్తిత్వాలు పనికిరావు.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికం అవుతుంది. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. పనులు పూర్తి చేయడంలో ఆలస్యం అవుతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. పట్టుదలతో కార్యసాధన చేయడం అవసరం. పనులకు అనుగుణంగా ఆలోచనలు మార్చుకోవాలి.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం అవసరం. పాదాల నొప్పులు వస్తాయి. అనసవర ఖర్చులు చేస్తారు. ప్రయణాలలో ఒత్తిడి అధికం అవుతుంది. సుఖంకోసం ఆలోచన పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. అధికారిక ఖర్చులు ఉంటాయి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశయాలు నెరవేరుతాయి. పెద్దలతో అనుకూలతకోసం ప్రయత్నం. ఆదర్శవంతమైన జీవితంకోసం ఆరాటపడతారు. తరులపై ఆధారపడతారు. అన్ని రకాల లాభాలు వస్తాయి. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారులతో అనుకూలత పెరుగుతుంది. పనులలో పట్టుదల పెరుగుతుంది. మొండితనంతో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్రమత్తత అవసరం.