17 అక్టోబర్ 2018 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 17th october2018 your horoscope

 

 మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పోటీల్లో గెలుపు సాధిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వృత్తి విద్యలపై ఆసక్తి ఉంటుంది. నష్టవస్తు పరిజ్ఞానం ఉంటుంది.  కలహాలకు కాలు దువ్వుతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సంతాన ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువౌవుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. ఆత్మీయతను కోల్పోతారు.   లలిత కళలపై ఆసక్తి తగ్గుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మాతృసౌఖ్యలోపం ఉంటుంది. ఆహారంలో సమయపాలన  అవసరం. అనారోగ్య సూచన ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అధికారుల సహకారం లభిస్తుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పరామర్శలు ఉంటాయి. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ప్రచార, ప్రసార సాధనాల వల్ల సంతోషం కలుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మాట విలువ తగ్గుతుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. నిల్వ ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. పరామర్శలు ఉంటాయి. దృష్టి సంబంధ ఆలోచన  ఉంటాయి. మాటల్లో నెమ్మదితనం నేర్చుకోవాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అధికారులతో ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగస్తులకు బదిలీలు అయ్యే సూచన. ఉద్యోగ మార్పు ఉంటుంది. శారీరక శ్రమ ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పు ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. అనవసర చికాకులు ఉంటాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. పాదాల నొప్పులు వస్తాయి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. గుర్తింపు ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. సమిష్టి ఆశయ సాధన ఉంటుంది. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది.  ఇతరులపై ఆధారపడతారు. కళాకారులకు కష్టకాలం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. సంతృప్తి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అధికారులతో అనుకూలత ఉంటుంది. ఉద్యోగాలలో ఒత్తిడి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలకై ఆలోచన చేస్తారు. పెద్దలంటే గౌరవ మర్యాదలు. వ్యాపారస్తులు అప్రమత్తతగ ఉండాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనారోగ్య భావన ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. విద్యార్థులు శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. మృష్టాన్నభోజనంపైదృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనారోగ్య సమస్యల ఉంటాయి. ఆకస్మిక ఇబ్బందులు ఉంటాయి. ఇతరులపై ఆధారపడతారు.  క్రయ విక్రయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఒత్తిడితో పనులు పూర్తిచేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. భాగస్వామ్య సమస్యలు ఏర్పడతాయి. పదిమందిలో పలుకుబడికోసం ఆరాటం. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

  డా. ఎస్‌. ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios