17ఏప్రిల్ 2019 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 17th april2019 your horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శారీరక శ్రమ అధికం. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. ఉద్యోగులకు బదిలీలు ఉండే అవకాశం. అనవసర ప్రయాణాలు ఉంటాయి. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనవసర ఖర్చులు చేస్తారు. శారీరక శ్రమ ఉంటుంది. కాలం దుర్వినియోగం అవుతుంది. అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి.  మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది.  శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పెద్దల ఆశీస్సులు ఉంటాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది.  సమిష్టి కార్యసాధన చేస్తారు. సమిష్టి ఆదాయాలపై దృష్టి. కంపెనీల్లో వాలకై ఆలోచిస్తారు. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది.  శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : చేసే వృత్తిలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. శారీరక బలం పెరుగుతుంది. సంఘంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దలంటే గౌరవం ఉంటుంది. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. పరిశోధనల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులకు కష్టకాలం ఏర్పడుతుంది. సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది. దూరదృష్టి ఏర్పడుతుంది. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  అనవసర ఇబ్బందులు ఉంటాయి. క్రయ విక్రయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. అనారోగ్య భావన ఉంటుంది. పరామర్శలు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. కాలం దుర్వినియోగం అవుతుంది. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయాలలో జాగ్రత్త అవసరం. పదిమందిలో గుర్తింపుకోసం ఆరాటం. భాగస్వామ అనుబంధాలు అనుకూలిస్తాయి. పలుకుబడికోసం ఆరాటపడతారు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  అధికారులతో అనుకూలత ఉంటుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. పోీల్లో గెలుపుకై ప్రయత్నం. శతృవులపై విజయం సాధిస్తారు. ఋణ సంబంధ ఆలోచనల్లో అనుకూలత పెరుగుతుంది. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మానసిక ఒత్తిడి ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఉంటాయి. సృజనాత్మకతను కోల్పోతారు. పరిపాలన లోపాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఒత్తిడి సమయం. పరిపాలన సమర్థత ఉంటుంది. ఆత్మీయతను కోల్పోతారు. జాగ్రత్త అవసరం. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. గృహం కోసంఆరాటం పెరుగుతుంది. ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆహారంలో సమయ పాలన అవసరం. అనారోగ్య సూచనలు ఉంటాయి. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అధికార వర్గ సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. అధికార వాహనాలు వచ్చే సూచనలు. విద్యార్థులకు ఒత్తిడి సమయం. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. పరామర్శలు ఉంటాయి. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనవసర ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు వస్తాయి. మాటల్లో అధికారిక ధోరణి ఉంటుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబంలో అసౌకర్యం ఉంటుంది. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. చేసే అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios