Asianet News TeluguAsianet News Telugu

12జూన్ 2019 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 12th june 2019 your horoscope
Author
Hyderabad, First Published Jun 12, 2019, 7:08 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. శతృవులపై విజయం సాధిస్తారు. శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.  అప్పులుతీర్చే ఆలోచన, ఇచ్చిన అప్పులు వెనక్కి వచ్చే అవకాశం. పోీల్లో గెలుపు. సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. ఆహారంలో అనుకూలత. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సంతానం వల్ల అనుకూలత. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సృజనాత్మకత పెరుగుతుంది. దగ్గరి బంధువుల సహకారం. మాటల వల్ల కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. బంధువర్గీయులతో జాగ్రత్త అవసరం. నిల్వధనం కోల్పోతారు. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. అనుకున్న పనులు పూర్తి. శ్రీమాత్రేనమః.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మాతృసౌఖ్యం లభిస్తుంది. ఆహారంపై దృష్టి ఎక్కువ. విద్యార్థులు కష్టపడి చదువుతారు. వాహనసౌకర్యాలు ఉంాయి. మాతృ వర్గీయులతో అనుకూలత. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన అవసరం. క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : రచనలపై ఆసక్తి. దగ్గరి ప్రయాణాలు. దగ్గరి బంధువుల సహకారం. తోి వ్యక్తులతో అనుకూలత. మాటల్లో నూతనోత్సాహం. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నం అధికంగా ఉంటుంది. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : నిల్వ ఉన్న ధనం పెంచుకోవాలనే ఆలోచన. కుటుంబంలో సంతోషకరమైన మార్పులు. మాటల్లో అనుకూలత. కిం సంబంధ అనుకూలతలు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. లాభాలు వచ్చినా సంతృప్తి ఉండదు. ఆశించిన ఫలితాలు సాధించలేరు. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికం. వెంటనే అలసి పోతారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో దృష్టి. ఆలోచనల్లో వైవిధ్యం. ప్రయత్నశీలత ఉంటుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు.  శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనవసర ఖర్చులపై దృష్టి. నిద్రకు సమయపాలన అవసరం. తెలియని వ్యాధులు. మానసిక ప్రశాంతత కోల్పోవడం, పాదాల సంబంధ నొప్పులు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. పరిశోధకులకు కొంత శ్రమ అధికం. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అనుకోని ఆదాయాలు. స్త్రీల ద్వారా ఆదాయం. కొంత దురాశ ఏర్పడుతుంది. కళానైపుణ్యం. ఆదర్శవంతమైన జీవితం. అన్ని రకాల అభివృద్ధులు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.  వైద్యశాలల సందర్శనం ఉంటుంది. దానధర్మాలు మేలు చేస్తాయి. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంఘంలో గౌరవం కోసం ఆరాటం. గౌరవం లభిస్తుంది. ఇతరులపై దయ చూపడం, వృత్తి ఉద్యోగాదుల్లో పదోన్నతి. అధికార కాంక్ష, సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంాయి. నూతన పరిచయాలు ఒత్తిడిని కలిగిస్తాయి. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : తీర్థయాత్రలపై దృష్టి. విద్య నేర్చుకోవడం వల్ల గౌరవం పెరుగుతుంది. పరిశోధనలపై ఆసక్తి, దూరదృష్టి, గురువులతో అనుకూలత, న్యాయ విషయాలపై దృష్టి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పోీల్లో విజయం సాధిస్తారు. పనులుపూర్తిచేస్తారు. శ్రీరామజయరామ జయజయ రామరామ మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులు, అనుకోని కష్టాలు, చెడు సహవాసాలు, చెడు పనులపై ఆసక్తి, చెడు మార్గాల ద్వారా ఆదాయంపై దృష్టి, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన సమస్యలు. దానధర్మాలు మంచి చేస్తాయి. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక సంబంధాలపై దృష్టి, సమాజంలో గౌరవం, భాగస్వాములతో అనుకూలత, వ్యాపారంపై దృష్టి, పోయిన వస్తువులు లభించడం, సౌకర్యాల వల్ల కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో లోపాలు వచ్చే సూచనలు. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios