ఈ వారం( జనవరి 4నుంచి 10వ తేదీ వరకు) రాశిఫలాలు
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. అనుకోని ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్తులు అధిక శ్రమతో ఫలితాల సాధన ఉంటుంది. ఉద్యోగాలపై దృష్టి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పదోన్నతి ఉంటుంది. ఖర్చులు పెట్టుబడులు అధికంగా చేస్తారు. సౌకర్యాల గురించిన ఆలోచన పెరుగుతుంది. ఆహార విహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటా యి. అనుకోని ప్రమాదాలకు అవకాశం. శ్రమలేని సంపాదనపై దృష్టి. మానసకిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. భాగస్వాములో అనుకూలత ఏర్పడుతుంది. ఉన్నత వ్యహారాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. కీరిత ప్రత్ఘిలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్యాలు వృద్ధి చెందుతాయి. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. అనుకోని కష్టాలను అధిగమిస్తారు. ఉన్న వ్యవహారాలపై దృష్టి లక్ష్య సాధన దిశగా పనులు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కమ్యూనికేషన్స్‌లో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోీల్లో గెలుపు సాధిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సౌకర్యాలు సమకూరుతాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. కాని శ్రమ ఉంటుంది. చేసే ప్రయత్నాల్లో జాగ్రత్తలు అవసరం. ఉన్నత వ్యవహారాల్లో చిక్కులు ఉంటా యి. అత్యాశతో చేసే పనులు పనికి రావు. తొందరపాటు పనికిరావు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. పనుల్లో తొందరపాటు పెంచుకోవాలి. సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక, శ్రమ ఒత్తిడి పెరుగుతాయి. సౌకర్యాల వల్ల సంతోషం ఏర్పడుతుంది. ఆహార విహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. చిన్న చిన్న ప్రమాదాలకు అవకాశం. విశ్రాంతి కోల్పోయే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులుటా యి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. వాిపై ఆలోచన తగ్గించుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సంప్రదింపులతో అవకాశం ఉంటుంది. అనుబంధాలు ప్రయాణాలకు దారి తీస్తాయి. ఆహార విషయంలో శ్రద్ధ అవసరం. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. అత్యాశ పనికిరాదు. విద్యార్థులు ఒత్తిడితో ఫలితాలసాధన ఉంటుంది. శ్రీరామ జయరామజయజయ రామరామ జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. కమ్యూనికేసన్స్ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మాటల్లో చమత్కార ధోరణి ఉంటుంది. అధికారిక సహకారం లభిస్తుంది. పితృవర్గీయులతో అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాల్లో అనుకూలత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాట విలు తగ్గుతుంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నిల్వలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యమైనవై ఉంటా యి. భాగస్వాములతో సంతోషం ఏర్పడుతుంది. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. విజయ సాధన ఉంటుంది. మాట వల్ల ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామ్య విషయాల్లో సంతోషం. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ ఉంటుంది. పనుల్లో ఒత్తిడులుటాయి. చిత్త చాంచల్యం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి. విందులు, వినోదాలకు అవకాశం ఉంటుంది. విశ్రాంతి లభిస్తుంది. కార్యనిర్వహణ సామర్థ్యం ఉంటుంది. అనేక పనులు నిర్వహిస్తారు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సంబంధాల్లో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పాదాల నొప్పులు ఉంటా యి. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. నిత్యావసర ఖర్చులపై దృష్టి పెడతారు. లాభాలు సంతృప్తికరంగా ఉంటా యి. అన్ని పనుల్లో అనుకూలతకు ప్రయత్నిస్తారు. వ్యర్థమైన పెట్టుబడులు పెడతారు. బాధ్యతలు పెరుగుతాయి. స్నేహసంబంధాల్లో ఒత్తిడులు ఉంటా యి. శ్రమాధిక్యం. జాగ్రత్తగా మెలగాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : లాభాలు ఉపయోగకరంగా ఉంటా యి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పనుల్లో చిత్త చాంచల్యం ఉంటుంది. అన్ని పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆర్థికాంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాట విలువ తగ్గే సూచనలు కనబడుతున్నాయి. అధికారిక ప్రయోజనాలు ఉంటా యి. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :ఊహించని ఇబ్బందులు ఉంటా యి. అనుకోని ప్రమాదాలకై అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. సంతృప్తిలోపం ఉంటుంది. అత్యున్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు పనికిరాదు. శ్రమతో కార్య సాధన ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో పదోన్నతి సూచితం. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.
డా.ఎస్.ప్రతిభ