ఈ వారం(ఫిబ్రవరి 22నుంచి 28వరకు) రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

this week feb 22nd to feb 28th horoscope is here

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం అధికం అవుతుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది.  ప్రారంభంలో భాగస్వామ్యాలకు అనుకూలం ఉంటుంది. అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం ఉంటుంది. సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. అనారోగ్య భావనలు ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం ఉంటుంది. ఖర్చులు పెట్టుబడులు అధికంగా ఉంటాయి. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఏర్పడుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సంతాన సమస్యలు ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సృజనాత్మకత తగ్గుతుంది. వ్యతిరేకతలు అధికంగా ఉంటాయి. అన్ని పనుల్లోనూ పోటీలు ఎదుర్కొటాంరు. శ్రమతో గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం ఉంటుంది. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. సామాజిక అనుబంధాలు  విస్తరిస్తాయి. అనుకోని సమస్యలు ఉంటాయి. నూతన పరిచయాలు అనుకూలం అవుతాయి. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుస్తారు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ఆందోళన తగ్గుతుంది. ఆర్థికాంశాల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు పనికిరాదు. పెద్దలతో వ్యతిరేకతలు పనికిరావు. శ్రమానంతరం విజయం లభిస్తుంది. అధికారిక వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. ప్రారంభంలో సౌకర్యాలపై దృష్టి ఏర్పడుతుంది. ఆహార విహరాలకు అనుకూలం ఏర్పడుతుంది.  సౌకర్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. గృహ వాహనాదుల విషయంలో కొత్త ఆలోచనలు తప్పవు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. నూతన ప్రణాళికలపై దృష్టి ఉంటుంది. వ్రమతో కార్య సాధన ఉంటుంది. శత్రువులపై విజయం తప్పదు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మాట విలువ తగ్గుతుంది. ఆర్థిక నిల్వలు తగ్గే సూచనలు. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. వారం ప్రారంభంలో సంప్రదింపులకు అవకాశం. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. సోదరవర్గీయులతో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆలస్య నిర్ణయాలు ఉంటాయి. వారాంతరలో అభీష్టసిద్ధి ఉంటుంది. పోటీల్లో గుర్తింపు లభిస్తుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలపై దృష్టి ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తాయి. శ్రమతో కార్యాల నిర్వహణ చేస్తారు. పెద్దలతో అనుబంధాలు విస్తరిస్తాయి. సంప్రదింపులకు అనుకూలం ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు అవసరం. లాభాలు సంతోషాన్నిస్తాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం ఉంటుంది. నిత్యావసర ఖర్చులు చేస్తారు. ప్రారంభంలో నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. ఆత్మ విశ్వాసం పెంచుకుటాంరు. కొత్త పనులకు రూపకల్పన చేస్తారు. ఇతరుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌విస్తరిస్తాయి. పోటీల్లో గుర్తింపు లభిస్తుంది. వాహనాది సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. లాభాలు సద్వినియోగం అవుతాయి. ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. ప్రయాణాదులకు అవకాశం ఏర్పడుతుంది. ఆహార విహారాదులుంటాయి. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. కుటుంబ అనుబంధాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుటాంయి. వ్యతిరేక ప్రభావాలుంటాయి. విజయం సాధిస్తారు. మాట విలువ తగ్గుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో అనుకూలంగా మెలగాలి. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. వ్యవహార దక్షత పెరుగుతుంది. ధార్మికమైన ఖర్చులు తప్పకపోవచ్చు. దానాదుల వల్ల మేలు కలుగుతుంది. ప్రయాణాదులకు అవకాశం ఏర్పడుతుంది. వారాంతరలో ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. అధికారిక వ్యవహారాలుంటాయి. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం ఉంటుంది. పదోన్నతిపై దృష్టి ఉంటుంది. ఖర్చులు పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. క్రమంగా ప్రయోజనాలపై దృష్టి ఉంటుంది. అనారోగ్య భావాలు పెరుగుతాయి. శ్రీదత్త శ్శరణం మమ జపం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు ఉంటాయి. ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి పెరుగుతాయి. లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. లాభాలు సంతోషానిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు, గౌరవం ఉన్నా శ్రమ తప్పదు. ఒత్తిడులను అధిగమించాలి. వారాంతంలో ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పరిచయాలు విస్తరిస్తాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రారంభంలో అన్ని పనుల్లో జాగ్రత్త ఉంటుంది. అనారోగ్య భావనలు ఉంటాయి. కొత్త పనులు వాయిదా వేయడం మంచిది. అనుకోని సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగాలపై దృష్టి పెరుగుతుంది. గౌరవ లోపాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైదృష్టి పెరుగుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios