ఈ వారం( సెప్టెంబర్21 నుంచి సెప్టెంబర్ 27వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వృత్తిలో అనుకూలతలు ఉంటాయి. రాజకీయాలపై దృష్టి ఉంటుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక బలం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. స్త్రీల ద్వారా అనుకూలత పెరుగుతుంది. దురాశ ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పాదాల నొప్పులుఉంటాయి. పరాధీన అవుతుంది. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలిస్తుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన. నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దూర దృష్టి ఉంటుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. గౌరవం లభిస్తుంది. పదిమందిలో గుర్తింపు లభిస్తుంది. ఇతరులపై ఆధారపడతారు. కంపెనీల్లో వాలకై ప్రయత్నిస్తారు. కళలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలిస్తుంది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. వైద్యశాలల సందర్శనం చేస్తారు. విద్యలో ఆటంకాలు ఉంటాయి. వైజ్ఞానిక విషయాలపై ఒత్తిడి ఉంటుంది. దూర దృష్టి ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి అధికం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలిస్తుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. పదిమందిలో గౌరవం లభిస్తుంది. భాగస్వామ్య సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. క్రయ విక్రయాల్లో జాగ్రత్త అవసరం. చెడు సహవాసం చేస్తారు. కోట్లాటలపై ఆసక్తి పెరుగుతుంది. అనారోగ్య భావన ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలిస్తుంది. దానాలు చేయడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. పనుల్లో అనుకూలత ఉంటుంది. కార్య సాధన చేస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. భాగస్వామ్య అనుబంధాలు అభివృద్ధి చెందుతాయి. పదిమందిలో పలుకుబడికోసం ఆలోచించాలి. పోయిన వస్తువులు దొరికే అవకాశం. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి ఏర్పడుతుంది. వైద్యశాలల సందర్శనం చేస్తార. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలిస్తుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంతానం సమస్యాత్మకంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికం. పరిశోధనలపై దృష్టి పెడతారు. పరిపాలన సమర్ధత కలిగి ఉంటారు. కళలపై ఆసక్తి ఉంటుంది. మంచి స్వభావం ఉంటుంది. శ్రమాధిక్యం గుర్తింపుకై తపిస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాయామం తప్పనిసరి. నష్టవస్తు పరిజ్ఞానం ఉంటుంది. శతృవులపై గెలుపు సాధిస్తారు. ఋణ ఆలోచనల్లో బయటపడతారు. నూతన పరిచయాల్లో ఒత్తిడి ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలిస్తుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అభివృద్ధికోసం ఆరాట పడతారు. విద్యార్థులకు ఒత్తిడి ఏర్పడుతుంది. కార్యాలయాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికం. సృజనాత్మకతను కోల్పోతారు. అనుకున్న పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సంతాన ఆలోచనల్లో లోపాలు ఉంటాయి. పోటీల్లో గెలుపుకై తపిస్తారు. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఋణ ఆలోచనల్లో విముక్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలిస్తుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సుగంధ ద్రవ్యాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆహారం విషయంలో సమయ పాలన అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. మానసిక ప్రశాంతతకోసం ఆలోచిస్తారు. చిత్త చాంచల్యం ఎక్కువ. పరిపాలన సమర్ధతను కలిగి ఉంటారు. సంతానం కోసం ఎక్కువ ఆలోచన ఉంటుంది. సృజనాత్మకతను కోల్పోతారు. చిత్తచాంచల్యం ఎక్కువ. పరిశోధలపై ఆసక్తి పెంచుకుటాంరు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలిస్తుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దానాల వల్ల ఆటంకాలు. మాటల వల్ల ఇబ్బంది. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. నిల్వ ధనం కోల్పోయే ప్రమాదం. జాగ్రత్త అవసరం. స్త్రీల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. దగ్గరి బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. పుస్తక పఠనం అధికంగా ఉంటుంది. పరామర్శలు ఉంటాయి. ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అభివృద్ధికోసం ఆరాట పడతారు. గణపతి ఆరాధన, శివపూజ, లక్ష్మీస్తోత్ర పారాయణం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికం. దేహ సౌఖ్యం కోల్పోతారు. చక్కి ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మాట విలువను కోల్పోతారు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అందరి సహాయ సహకారాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ప్రచార, ప్రసార సాధనాల్లో సంతృప్తి లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. సమీప వ్యక్తులతో అనుకూలత ఉంటుంది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతి లోపం ఉంటుంది. పాదాల నొప్పులు ఏర్పడతాయి.అన్ని రకాల ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకై ప్రయత్నిస్తారు. పనుల్లో పట్టుదల అవసరం. పనులకు అనుగుణంగా ఆలోచనల్లో మార్పు అవసరం. నిల్వ ధనం పై దృష్టి పెడతారు. వాగ్దానాల వల్ల ఇబ్బందులు పడతారు. కిం సంబంధ లోపాలు ఏర్పడతాయి. స్నేహితులతో అప్రమత్త అవసరం.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సమిష్టి ఆదాయాలు వస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. పనుల్లో సంతృప్తి లభిస్తుంది. పరాధీనత ఉంటుంది. విహార యాత్రలకై ఖర్చు అధికం. ఆలోచనల్లో భయం ఉంటుంది. సుఖం కోసం ఆలోచిస్తారు. దేహ సౌఖ్యం లోపిస్తుంది. అనవసర ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ అధికం. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. కార్యాచరణ అధికంగా ఉంటుంది. చేసే పనుల్లో ప్రణాళికలు వేసుకోవాలి. నిత్య కృషి శీలత అధికంగా ఉంటుంది.
డా.ఎస్ ప్రతిభ