Asianet News TeluguAsianet News Telugu

Solar Eclipse 2021: సూర్యగ్రహణం మన భారతదేశానికి వర్తించదు

మన భారతదేశం కాలమానం ప్రకారం అమావాస్య తిధి 3 డిసెంబర్ 2021 శుక్రవారం రోజు సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా 4 డిసెంబర్ 2021 శనివారం మధ్యాహ్నం 1: 12 నిమిషాల వరకే అమావాస్య ఘడియలు ఉన్నాయి.  

Solar Eclipse In India
Author
Hyderabad, First Published Dec 3, 2021, 1:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

 

* ఈ డిసెంబర్ 4 వ తేదీ కార్తీక అమావాస్య శనివారం వృశ్చికరాశిలో ఏర్పడే కేతుగ్రస్త సూర్యగ్రహణం మన భారతదేశానికి వర్తించదు.  గ్రహణ సూతక నియమాలు, పట్టువిడుపు స్నానాలు మొదలగు ఎలాంటి నియమ నిబంధనలు లేవు. 

* మన భారతదేశం కాలమానం ప్రకారం అమావాస్య తిధి 3 డిసెంబర్ 2021 శుక్రవారం రోజు సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అనగా 4 డిసెంబర్ 2021 శనివారం మధ్యాహ్నం 1: 12 నిమిషాల వరకే అమావాస్య ఘడియలు ఉన్నాయి.  

* గర్భిణీ స్త్రీలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దు. వదంతులను నమ్మకండి. రోజు ఎలా ఉంటారో ఈ రోజు కూడా అలానే ఉండవచ్చును. లేనిపోని అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దు. ధ్యానం లేక దైవనామ స్మరణతో ఉండండి చాలు శుభాలు కల్గుతాయి.  
 
* జనవరి 4  నుండి 14 జనవరి వరకు శుక్రమౌడ్యమి ఉన్నది. పుష్యమాసంలో శుభముహూర్తాలు లేవు. 

* మాఘమాసంలో 2 ఫిబ్రవరి 2022 బుధవారం నుండి శుభముహూర్తాలు ప్రారంభం అవుతాయి. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios