Asianet News TeluguAsianet News Telugu

సింహ రాశిలో రవి సంచారం.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం

కొంచెం అహంకారం, మొండితనం కూడా పెరుగవచ్చు. వీరు గుండె సంబంధ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ఆలోచనల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎక్కువగా ఏ విషయంలోనూ స్ట్రెస్‌ తీసుకోకూడదు. 17 సెప్టెంబర్‌ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మేష, కర్కాటక, సింహ, మకర, కుంభ రాశుల వారు

ravi snacharam in simha rashi
Author
Hyderabad, First Published Aug 26, 2019, 12:34 PM IST

రవి సింహరాశిలోకి18 ఆగస్టున మార్పు చెందాడు. సింహరాశి రవికి స్వక్షేత్రం. ఆ క్షేత్రంలో రవి చాలా బలంగా ఉంటాడు. సింహరాశివారికి కొంచెం రవి ప్రభావం అధికంగా ఉంటుంది. అధికారిక పనుల వలన తరుచు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొంచెం అహంకారం, మొండితనం కూడా పెరుగవచ్చు. వీరు గుండె సంబంధ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ఆలోచనల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎక్కువగా ఏ విషయంలోనూ స్ట్రెస్‌ తీసుకోకూడదు. 17 సెప్టెంబర్‌ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మేష, కర్కాటక, సింహ, మకర, కుంభ రాశుల వారు.

వేరు వేరు రాశులవారికి ఏవిధంగా ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

మేషం : వీరు ఏ విషయంలో కూడా స్ట్రెస్‌ తీసుకోకూడదు. ఎక్కువగా ఆలోచించకూడదు. సంతానంకోసం ఆలోచన అధికమౌతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. ఆలోచనల్లో అలజడి పెరుగుతుంది. ఏవో భయాలు మనసులో ఆందోళనకు గురిచేస్తాయి. ప్రశాంతంగా నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలి. సూర్యపారాయణ చేయడం మంచిది.

వృషభం : తమకు లేని విషయంపై దృష్టి పెడతారు. అవి సమయానికి అందకపోవచ్చు. ఆహారం సమయానికి అందకపోవచ్చు.  మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. గౌరవహాని జరగవచ్చు. గౌరవాదులకోసం ఎక్కువ ప్రాకులాడకూడదు. తమకు గౌరవం లేని చోట పక్కకు జరగడం మంచిది. వీరు ప్రతి నిత్యం సూర్యపారాయణ చేయడం మంచిది.

మిథునం : వీరికి రవి తృతీయ సంచారం ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ బాగా విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అన్ని పనుల్లో సంతోషం ఏర్పడుతుంది. విద్యార్థులు కష్టపడి విజయం సాధిస్తారు. వీరు ప్రతి నిత్యం సూర్యపారాయణ చేయడం మంచిది.

కర్కాటకం : ద్వితీయంలో రవి సంచారం ఉంటుంది.  దీనివలన మాటల్లో కఠినత్వం ఉంటుంది. మాట్లాడే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధాల వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు. ఆత్మీయులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక నిల్వల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టకూడదు. ఎక్కువగా మౌనంగా ఉండడంమంచిది.

సింహం : శరీరం తొందరగా అలసిపోతుంది. మొండితనంతో పనులు చేస్తారు. తమకు అవసరం లేని పనులు అన్నీ ఈ సమయంలో వచ్చి పడతాయి. ఒకేసారి పది పనులు చేయాల్సి వస్తుంది. తరచు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు అయితే వేరే ప్రదేశాలకు టాన్ఫర్స్‌ అవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సూర్యారాధనమేలు.

కన్య : విశ్రాంతికై ప్రయతిస్తారు. విశ్రాంతి తొందరగా లభించదు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.  వైద్యశాలల సందర్శనం ఉంటుంది. రాత్రిళ్ళు నిద్ర తక్కువగా ఉంటుంది. ఆలోచనలు, ఆవేశాలు పెరుగుతాయి. అన్ని పనులు ఒత్తిడితో పూర్తి చేస్తారు. దానాలు చేయడం మంచిది. వీరు ప్రతి నిత్యం సూర్యపారాయణ చేయడం మంచిది.

తుల : అధికారిక లాభాలు ఉంటాయి. అధికారులతో అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. పెద్దలు, అధికారుల అండ దండలు పెరుగుతాయి. వారి సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. వీరు ప్రతి నిత్యం సూర్యపారాయణ చేయడం మంచిది.

వృశ్చికం : సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో నైపుణ్యం పెరుగుతుంది.  అధికారుల ఆదరణ తక్కువౌతుంది. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. హోదా గౌరవం పెరిగిన దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. దాని వల్ల స్ట్రెస్‌ పెరుగుతుంది. ఆలోచనలు తక్కువ చేసుకునే ప్రయత్నం చేయాలి. శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.

ధనుస్సు : సంతృప్తి లోపం పెరుగుతుంది. ఏ పనులు వేగవంతంగా పూర్తి చేయలేరు.పనుల ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అధికారిక ప్రయాణాలు ఆచి, తూచి చేయాల్సి ఉంటుంది. సూర్యపారాయణ చేయడం మంచిది.

మకరం : అనారోగ్య సమస్యలుఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అధికారులతో అప్రమత్తత అవసరం. అవనసవర ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనం వృథా అవుతుంది. ఏ పని చేసినా ఒకికి రెండుసార్లు ఆలోచించి మరీ చేయండి. వీరు ప్రతి నిత్యం సూర్యపారాయణ చేయడం మంచిది.

కుంభం :  సామాజిక అనుబంధాలు శ్రమతో సాధించాలి. సామాజిక ఒత్తిడి అధికమౌతుంది. భాగస్వామిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టకూడదు. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. పరిచయాలు పెంచుకోకపోవడం మంచిది. వీరు ప్రతి నిత్యం సూర్యపారాయణ చేయడం మంచిది.

మీనం : శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపు ఉంటుంది. ఋణ సంబంధ ఆలోచనలు తీరుతాయి.  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అన్ని ప్రదేశాల్లో విజయం సాధిస్తారు. కొంత అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది. అహంకారం వల్ల అందరూ దూరమౌతారు. జాగ్రత్తగా ఉండాలి. సూర్యపారాయణ చేయడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios