Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు ఎంత ఖర్చు చేస్తే అంత డబ్బు తిరిగి వస్తుంది!
న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు కొన్ని పనులు చేయకూడదు. కొన్నింటికి దూరంగా ఉండాలని చెబుతుంటారు. అయితే ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు మాత్రం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే తొందరగా ధనవంతులవుతారట. ఎంత ఖర్చు చేస్తే అంత డబ్బు వస్తుందట. అదెంటో తెలుసుకోండి.

ప్రతి ఒక్కరూ కష్టపడేది డబ్బు కోసమే. ఏ అవసరం తీరాలన్న డబ్బు ముఖ్యం. ఫుడ్, ఇల్లు, బట్టలు, చదువు, ఆరోగ్యం లాంటి అవసరాలు తీర్చుకోవాలంటే డబ్బులు తప్పనిసరి. కొందరు ఏమీ ఆలోచించకుండా చిన్న చిన్న వాటికి డబ్బులు ఖర్చు పెడితే, మరికొందరు మాత్రం పిసినారిగా ఉంటారు. చిన్న ఖర్చు పెట్టాలన్నా చాలాసార్లు ఆలోచిస్తారు. ఇంకొందరు మాత్రం కొంత ఖర్చుపెడితే, మరికొంత ఆదా చేసుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు మాత్రం డబ్బు ఖర్చుచేస్తేనే మంచిదట. అదెంటో చూసేయండి.
న్యూమరాలజీ ప్రకారం డబ్బు ఖర్చు చేస్తే?
న్యూమరాలజీలో ప్రతి ఒక్కరి ప్రవర్తన, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. న్యూమరాలజీ ప్రకారం కొంతమంది డబ్బు ఖర్చు చేస్తేనే మంచిదని చెబుతున్నారు. వీళ్లు ఎంత ఖర్చు చేస్తే అంత డబ్బు వస్తుందట. ఆ పుట్టిన తేదీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ తేదీల్లో పుట్టిన వారు డబ్బు ఖర్చు చేస్తేనే మంచిది!
న్యూమరాలజీ ప్రకారం, ఏ నెలలో అయినా 4, 6, 9, 13, 15, 18, 22, 24 లేదా 27 తేదీల్లో పుట్టిన వాళ్లు డబ్బును బాగా ఖర్చు చేయాలి. వీళ్లు ఖర్చులను కంట్రోల్ చేసుకుని దాచుకుంటే, డబ్బు రావడం ఆగిపోతుంది. ఖర్చు చేస్తేనే వాళ్లకు డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. అందుకే, వీలైనంత వరకు తమ కోసం ఖర్చు చేసి కోరికలు తీర్చుకోవాలి.
ఈ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు!
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలో అయినా 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు వారి భర్తకు అదృష్టాన్ని తీసుకువస్తారు. ఈ అమ్మాయిలు ఏ ఇంట్లో అడుగు పెడితే అక్కడ డబ్బులకు లోటు ఉండదు. సంతోషం, శాంతి, సమృద్ధి, సంపద, వైభవం ఎప్పుడూ ఉంటాయి.
ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో మోసపోయే ఛాన్స్!
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 2, 4, 6, 8, 11, 13, 15, 17, 20, 22, 24, 27, 29 లేదా 31 తేదీల్లో పుట్టిన వాళ్లు ప్రేమలో మోసపోయే ఛాన్స్ ఉంది. వీళ్లు మనసులో స్వచ్ఛంగా ఉంటారు. ప్రతి బంధాన్ని నిజాయితీగా చూసుకుంటారు. కానీ, ఒకరినొకరు బాగా ప్రేమించుకున్నా సరే, బాధతో, ఒంటరితనంతో ఉంటారు.