3 నవంబర్ 2018 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

nov3rd your horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. ఒత్తిడి అధికం అవుతుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. అనారోగ్యం వచ్చే సూచనలు ఉన్నాయి. అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది. లక్ష్మీపూజ చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శత్రువులపై విజయాలకు తపిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి విద్యలపై ఆసక్తి ఉంటుంది. శారీరక బలం పెరుగుతుంది. వ్యాపారస్తులు అనుకూలత ఉంటుంది. లక్ష్మీపూజ చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సృజనాత్మకత పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. విద్యార్థులు పరిశోధనల్లో రాణిస్తారు. అధికారులతో అనుకూల ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూల ఏర్పడుతుంది. పరామర్శలు చేస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. లక్ష్మీపూజ చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ సౌకర్యాలు పొందే ఆలోచన ఉంటుంది. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు చాకచక్యంగా వ్యవహరిస్తారు. తీసుకునే ఆహారంలో సంతృప్తి లభిస్తుంది. గృహంలో సంతృప్తి కలుగుతుంది. లక్ష్మీపూజ చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : స్త్రీల, మరియు కళాకారుల సహకారాలు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధిస్తారు. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ప్రచార, ప్రసార సాధనాల్లో సంతృప్తి లభిస్తుంది. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. లక్ష్మీపూజ చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వాగ్దానాలు నెరవేరుతాయి. వాక్‌ చాతుర్యం పెరుగుతుంది.  మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆభరణాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. స్థిరఆస్తులపై ఆసక్తి పెరుగుతుంది. అన్ని రకాల ఆనందాలు ఉంటాయి. లక్ష్మీపూజ చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శరీర సౌఖ్యం ఉంటుంది. శ్రమ తక్కువగా ఉంటుంది. ఎక్కువ సంతోషం ఉంటుంది. పనుల్లో సృజనాత్మకత ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సౌకర్యాలపై దృష్టి పెడతారు. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. లక్ష్మీపూజ చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విహార యాత్రలపై దృష్టి అధికం అవుతుంది. విహార యాత్రలకు ఖర్చు చేస్తారు. విలాసాలవైపు దృష్టి ఉంటుంది. అనవసర ప్రయాణాలు ఉంటాయి. అనవసర ఖర్చులు అధికం అవుతాయి. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పనులలో నూతనోత్సాహం ఉంటుంది. లక్ష్మీపూజ చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. ఆశీస్సులు లభిస్తాయి. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ఉపాసనపై దృష్టి పెడతారు. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. లక్ష్మీపూజ చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంఘంలో గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయ వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో పదోన్నతి సూచితం. లక్ష్మీపూజ చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది.  శుభకార్యాల్లో పాల్గొటాంరు. సజ్జన సాంగత్యం ఉంటుంది. పరాశ్రయం ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. దూరదృష్టి పెంచుకుంటారు. లక్ష్మీపూజ చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనుకోని ఆదాయాలు వస్తాయి. శ్రమలేని సంపాదనపైదృష్టి ఉంటుంది. అనారోగ్య సూచనలు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పరాధీనం అవుతుంది. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి.  ఊహించనిఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. లక్ష్మీపూజ చేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios