శుక్రుడు శరీరంలో హార్మోన్‌ సిస్టంకు కారకుడు. శరీరంలో హార్మోన్లు సరియైన సమయానికి విడుదల కావాలంటే శుక్రుడే కారణం వహిస్తాడు. శుక్రుడు ఆకర్షణలకు కారణకుడు. శుక్రుడు విలాసాలకు కూడా కారకుడు. లలిత కళలకు, ఇండోర్‌ గేమ్స్‌కు కారకుడు. లాయర్‌ లకు, ీచర్‌, జ్యోతిష్కులకు, కారకుడు. ఈ విద్యలన్నీ రావాలంటే శుక్రుడు అనుకూలంగా ఉండాలి. కవిత్వానికి కారకుడు. శరీరంలో చెవికి కారకుడు. శరీరం సంతులితంగా ఉండడానికి కారకుడు.

29.6.2019న మిథునరాశిలోకి వచ్చి 23.7.2019 వరకు మిథున రాశిలోనే ఉంాడు. వేరు వేరు రాశుల వారికి ఈ సంచారం ఎలా ఉంటుందో గమనిద్దాం.

మేషం : కళాకారుల సహకారం లభిస్తుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. రచనలు ఆకర్షీయణంగా చేస్తారు. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. ఆహ్లాదకర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు తక్కువ శ్రమతో అధికం లాభం ఉంటుంది. వ్యాపార ప్రకటన దారులకు అనుకూలమైన సమయం. దానధర్మాలు అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.

వృషభం : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు ఉపయోగపడతాయి. మాటల వల్ల కుటుంబ సంబంధాలు మెరుగు పడతాయి. దూరపు బంధువులను ఆకర్షిస్తారు. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అలంకరణ వస్తువులపై దృష్టి వెడుతుంది. కుటుంబ సబంధాలు సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

మిథునం : శరీరం దృష్టి ఎక్కువగా పెడతారు. అందంగా అలలంకరించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. శారీరక శ్రమకు అంతగా ఇష్టపడకపోవచ్చు. పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటూ వెళతారు. పనుల్లో మెళుకువలు చూపిస్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే ప్రయత్నం చేస్తారు. శ్రీ మాత్రేనమః జపం చేసుకోవడం మంచిది.

కర్కాటం : విశ్రాంతి లభిస్తుంది. విహార యాత్రలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనాలనే ఆలోచన ఏర్పడుతుంది.  మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనే కోరిక పెరుగుతుంది. దానధర్మాలకై ధనం వెచ్చించాలి. శ్రీమాత్రేనమః జపం మంచిది.

సింహం : కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు పూర్తి చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. చేసే అన్ని పనుల్లో ఆదాయాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు వచ్చిన లాభాలు సద్వినియోగం అవుతాయి. స్త్రీలతో అనుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దానధర్మాలు మంచిది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కన్య : సామాజిక అనుబంధాలు మెరుగు పడతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకై ఆరాట పడతారు. శారీరక ధారుడ్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత లభిస్తుంది. అధికారులతో సంతోషంతో కాలం గడుపుతారు. తండ్రి, పెద్దవారిపై గౌరవం పెరుగుతుంది. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. శ్రీమాత్రేనమః

తుల : విద్య నేర్చుకోవడం వల్ల ఆనందం కలుగుతుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. సజ్జన సాంగత్యం చేస్తారు. దూరదృష్టి ఉంటుంది. మఠాధిపతులకు అనుకూల సమయం. విహార యాత్రలు చేస్తారు. పరాక్రమం పై దృష్టి ఉంటుంది. చేసే అన్ని పనుల్లో సంతృప్తి కలుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం : ఊహించని ఆనందాలు వచ్చే సూచనలు ఉన్నాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు సాధిస్తారు. అనవసర ఖర్చులు ఉంాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉండే సూచనలు. పరామర్శలు చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. శ్రమలేని ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానధర్మాలు అవసరం. శ్రీమాత్రేనమః జపం మంచిది.

ధనుస్సు : సామాజిక అనుబంధాలు ఒత్తిడిని తెస్తాయి. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. నూతన పరిచయాలు అంత అనుకూలించకపోవచ్చు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు. గౌరవం కోల్పోయే సూచనలు ఉన్నాయి. తోివారితో అప్రమత్తంగా మెలగాలి. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం : పోీల్లో గెలుపుకై అధిక ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తాయి. రోగనిరోధకశక్తి తగ్గుతుంది.  కార్యసాధనలో పట్టుదల అవసరం. వైవాహిక జీవితంలో కొంత జాగ్రత్త   అవసరం. వైవాహిక జీవన విషయంలో తొందరపాటు పనికిరాదు. ముందుగానే చెల్లించడం మంచిది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. క్రీంఅచ్యుతానంత గోవింద మంచిది.

కుంభం : సృజనాత్మకత పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సంతానం వల్ల సంతోషం లభిస్తుంది. సంతోషం కోసం చేసే ఆలోచనలు ఫలితాస్తాయి. చిత్త చాంచల్యం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు మెరుగు పడతాయి.  శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మీనం : సౌకర్యాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో సంతృప్తి లభిస్తుంది. వాహన సౌఖ్యం లభిస్తుంది. విహార యాత్రలు చేస్తారు. మాతృసౌఖ్యం లభిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఒక వంతు ముందుకు సాగుతాయి. కొద్ది శ్రమతో లాభాలువస్తాయి. విందు వినోదాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యలు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.