డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఆదాయం -  5 , వ్యయం  -  5                              రాజపూజ్యం     - 3 ,  అవమానం – 1 


•    మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి.

•    గత ఐదు సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయట పడతారు, 

•    ఆగష్టు తర్వాత శుభ ఫలితాలు పొందుతారు.

•    ఆర్ధిక ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పటికినీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

•    వ్యాపార, గృహ సంబంధమైన వ్యవహారాలు నత్త నడక నడిచినా కొన్నింటిలో లాభాలు పొందుతారు.

•    మిమ్మల్ని ఆన్ని విధాలుగా అనుకూలంగా చూసుకునే వ్యక్తులే కొంచం మీపై వ్యతిరేకత చూపుతారు.   

•    మీరు ఎంతో రహస్యంగా దాచిన మీ వ్యక్తీ గత విషయాలు బయట పడతాయి. దీని వలన కొంత మనస్తాపం చెందుతారు. 

•    ధీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు.

•    కుటుంబ, వ్యక్తిగత విషయాలలో మీరే దగ్గరుండి చూసుకోవాలి ... అప్పుడే అవి ఫలితాలను ఇస్తాయి.

•    సెప్టెంబర్ నుండి అన్నింటిలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం మీపై ఉందని గ్రహిస్తారు.

•    గాలిలో దీపం పెట్టి దేవునిపై భారం వేయరు, కష్టపడి పనిచేస్తారు, అఖండ ఖ్యాతిని పొందుతారు.

•    మీకు అత్యంత సన్నిహిత వ్యక్తీ దూరం కావడం మానసిక క్షోభకు గురిఅవుతారు. కొంతకాలం అన్నింటికి దూరంగా ఉంటారు.  

•    వివాహాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. 

•    పైకి శాంతంగా కనిపించినా కటువుగా కనిపించక పోయిన మనస్సులో ఉన్న పగ , ప్రతీకారాన్ని ఎంతో కాలం పోషిస్తారు.

•    విదేశాల నుండి మీరు కోరుకున్న శుభవార్త  వస్తుంది.

•    కొత్త మిత్రలు దూరం అవుతారు , పాత స్నేహాలు దగ్గరౌతాయి.

•    జీవితం రొటిన్ గా ఉండ కూడదని మార్పులు చేయాలని సంకల్పించు కుంటారు.

•    రాజకీయ పరమైన విషయాలలో మీ ప్రమేయం అనివార్యం అవుతుంది. ప్రత్యేక్షంగా కాని పరోక్షంగా కాని రాజకీయ ప్రవేశం ఉంటుంది.

•    సమాజంలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్నవారికి మీ సలహా, సహాయం అవసరం అవుతాయి.

•    మీకు ఎదురుతిరిగిన వారు ఇబ్బందుల పాలౌతారు. 

•    మీ జాతకంలో దశమ భావం బాగుంటే ఈ సంవత్సరం మీరు కోరుకున్న మంచి ఉద్యోగం వస్తుంది.

•    అవివాహితులకు వివాహం జరుగుతుంది.

•    కొద్దిగా గైనిక్ ఇబ్బందులు ఉంటాయి. మంచి అనుభవజులైన డాక్టర్ ను సంప్రదించండి.
 
•    సంతానం లేని వారికి సంతాన యోగం ఉంటుంది. మీకు పెళ్ళి చాలా కాలం అయిన పిల్లలు కలగక పొతే మీ దంపతుల జాతకాలను పరిశీలన చేయించుకొండి.   

•    జీవిత భాగస్వామితో విభేదాలు రావద్దు , కొంత మంది విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.   

•    కపట స్నేహాలు చేసే వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వలన కొంత ఇబ్బంది తలెత్తుతుంది.

•    ప్రభుత్వ ఉద్యోగ సూచనలు ఉన్నాయి, గట్టి ప్రయత్నాలు చేయండి.

•    విదేశీ చదువులు, ఉద్యోగాలు చేస్తా అనుకున్న వారికి అనుకూల కాలం.

•    కమర్షియల్ ఏరియాలో ఆపార్ట్ మెంట్ కొంటారు. 

•    కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు.

•    ఉద్యోగంలో బదిలీలు సూచిస్తున్నాయి.. కొన్ని సాంకేతిక కారణాలతో బదిలీ ఆగిపోతుంది.

•    ఉద్యోగంలో ప్రమోషన్లు కలుగుతాయి.

•    పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. 

•    ఒకరు చేసిన తప్పుకు మీరు ఫలితం అనుభవించాల్సి వస్తుంది. 

•    సివిల్ సర్వీసులకు ఎన్నిక అవుతారు.

•    మీ ఆద్వర్యంలో నడిచేవి లాభసాటిగా సాగుతాయి.

•    నిర్ణయాలు తీసుకునేప్పుడు ఎక్కువ కాలయాపన చేయవద్దు.
           
మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.