డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఆదాయం - 8, వ్యయం - 11,                 రాజపూజ్యం - 1,  అవమానం - 2

• ఈ రాశి వారికి చతుర్ధంలో ఉన్న రాహువు, దశమంలో ఉన్న గురుకేతువులు, ఏకాదశంలో ఉన్నశని ఫలితంగా 

• ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి.

• స్నేహితులతో తాత్కాలిక వ్యాపారాలు ప్రారంభించి లాభపడతారు. 

• కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. ఆ కారణంగా బయట కార్యక్రమాలను సులువుగా, ఉత్సాహంగా చేయగలుగుతారు.

•  భూమి సంబంధమైన వ్యాపారాలలో లాభం పొందుతారు. అమ్మకాలు, కొనుగోలు వల్ల లాభపడతారు.

• విశేషంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్‌వారికి అనుకూలంగా ఉంటుంది. 

• భూ సంబంధ, వ్యాపార వ్యవహారాలో లాభాలు. అమ్మకాలు, కొనుగోలు లాభిస్తాయి. 

• ఆధికారులు, ప్రముఖులతో ఆచితూచి మాట్లాడాలి. 

•  సంతాన పురోభివృద్ధికి కొంత సమాయాన్ని కేటాయిస్తారు. సంతాన పురోగతి మందగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

• సహోదర వర్గం ప్రేమ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. 

• కొద్దిగా వయసు మళ్ళిన వారికి మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులున్నాయి.

• భవిష్యత్తు కార్యక్రమాల గురించి స్పష్టమైన ప్రణాళిక ఉండదు.

• బంధువర్గాలకు మేలుచేసినా విరోధమే మిగులుతుంది.

• విందులు, వినోదాలు, శుభాకార్యాలలో అవమానాలను ఎదుర్కొంటారు.

• స్థిరాస్థి కొనుగోలు విషయంలో జాప్యం తప్పదు. 

• సంస్థాపరంగా తీసుకున్న నిర్ణయాలు విమర్శలకు కారణమవుతాయి. 

• గతంలో వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. మొండిబాకీలు వసూలవుతాయి.

• సహోదర వర్గం వివాహాలు చికాకు కలిగిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటారు.

• మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఇతరుల సహాయసహకారాలు లభిస్తాయి. 

• ఆర్ధికంగా వ్యాపార పరంగా ఆకులంగానే ఉంటుంది.

• పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. అనుకున్న ఉద్యోగం సాధిస్తారు. 

• రాజకీయంగా అనుకూలంగా ఉంది. 

• ప్రేమ వివాహాల పట్ల మీకున్న సంశయాలు తొలగిపోతాయి.

• కోపతాపాలకు దూరంగా ఉంటారు.పెద్ద పెద్ద విషయాలు అనుకూలంగా మారుతాయి.
 
మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.