Asianet News TeluguAsianet News Telugu

కుజ సంచారం.. ఏ రాశివారికి ఎలా ఉంటుంది?

కుజుడు ప్రస్తుతం కర్కాటకరాశిలో సంచారం ఉన్నది. 23.6.2019 నుంచి 8.8.2019 వరకు కర్కాటకరాశిలో సంచారం చేస్తాడు. కుజుడు కర్కాటక సంచారం వేరువేరు రాశులవారికి  ఏ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

kujudu efefct on horoscope
Author
Hyderabad, First Published Jul 2, 2019, 11:59 AM IST

కుజుడు శరీరంలో ఎముకలల్లోని పటుత్వానికి, దంతాలకు కారకుడు అవుతాడు. ఏదైనా వస్తువును గట్టిగా పట్టుకోవాలనుకున్నా దానికి కారణం కుజుడే. శరీర ఆకృతికి కారకుడు. కుజుడు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే శరీరంలో పటుత్వం బాగా లభిస్తుంది. ఈ పటిష్టత వల్లనే అహంకారం కూడా మొదలౌతుంది. శరీరంలో కాముకతకు కారకుడు. ఎదుటివారిపై ఆధిపత్యం చలాయించాలని, నేను చేస్తాను అనే ఆలోచన ఏదైనా కుజుడికి సంబంధించినదే.

కుజుడు ప్రస్తుతం కర్కాటకరాశిలో సంచారం ఉన్నది. 23.6.2019 నుంచి 8.8.2019 వరకు కర్కాటకరాశిలో సంచారం చేస్తాడు. కుజుడు కర్కాటక సంచారం వేరువేరు రాశులవారికి  ఏ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆహారంలో సమయ పాలన మంచిది. ఎక్కువ స్పైసీ ఆహారం తీసుకోకపోవడం మంచిది. కడుపులో మంట అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి.  శత్రువులపై విజయం సాధిస్తారు. క్రీం అచ్యుతానంత గోవింద జపం మంచిది.

వృషభం : కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఎంత ప్రయాణం చేసినా అలసట అనేది తొందరగా రాదు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం : వీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆచి, తూచి వ్యవహరించాలి. కుటుంబ సంబంధాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిల్వ ధనాన్ని కోల్పోయే సూచనలు ఉన్నాయి. మధ్యవర్తిత్వాలు పనికిరావు. మాటల్లో కాఠిన్యత కనిపటిష్టతస్తుంది.   గృహసంబంధ పనులు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.

కర్కాటకం : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ అధికంగా చేస్తారు. కాని శరీరం తొందరగా అలసిపోదు. అహంకారం పెరుగుతుంది. శరీరం ఒక అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. అనవసర చికాకులు పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. శ్రీదత్తశ్శరణం మమ జపం మంచిది.

సింహం : విశ్రాంతి లభించదు. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.విహార యాత్రలు చేస్తారు. దేహసౌఖ్యం లోపటిష్టతస్తుంది. దేశాంతరం తిరిగే ఆలోచన చేస్తారు. ఆహారంలో కొంత కారం, స్పైసీ ఫుడ్‌ను, వేపుడులు, నూనె పదార్థాలను బాగా ఇష్టపడతారు. శ్రీదత్త శ్శరణంమమ జపం మంచిది.

కన్య : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం అధికం చేస్తారు. లాభాలు వచ్చినా అనుకున్న సంతోషం ఉండదు. లాభాలు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. ఇతరులపై ఆధారపడతారు. సమిష్టి ఆశయాలు పూర్తిచేస్తారు. సంఘ వ్యవహారాల్లో పాల్గొనాలనే ఆలోచన బాగా ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

తుల : సంఘంలో గౌరవం పెంచుకునే ఆలోచన బాగా పెరుగుతుంది. రాజకీయ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అందరిపై గెలవాలనే తపన పెట్టుకుటాంరు. వృత్తి ఉద్యోగాదుల్లో పోటీ లు అధికంగా ఉంటాయి. పోటీ ల్లో విజయ సాధన ఉంటుంది. సంతోషకరవాతావరణం నెలకొనే ప్రయత్నం చేస్తారు. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.

వృశ్చికం : డబ్బులు కోల్పోయే సూచనలు. పరిశోధనల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. శుభకార్యాలలో పాల్గొనాలనే ఆలోచన   చేస్తారు. విద్య నేర్చుకోవడం వలన ఒత్తిడి ఏర్పడుతుంది. దూరదృష్టి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పరిశోధనల వల్ల జాగ్రత్తగా ఉండాలి. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.

ధనుస్సు : ఊహించని ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు అవుతాయి. అనారోగ్య సూచనలు. ఇతరులపై ఆధారపడతారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. మానసిక, శారీరక ఒత్తిడి అధికంగా వచ్చే సూచనలు కనిపటిష్టతస్తున్నాయి. కందిపప్పుదానం మంచిది. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

మకరం : సామాజిక అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా మెలగాలి. భాగస్వామ్య అనుబంధాలు విస్తరించుకోవద్దు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండే సమయం. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. శ్రమతో పనుల సాధన చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు, ఫలితం రాదు. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

కుంభం : శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. పోటీ లలో గెలుపు లభిస్తుంది. రోగనిరోధకశక్తి బావుంటుంది. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. అప్పుల బాధలు తీరుతాయి. ఔషధ సేవనం ఉంటుంది. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

మీనం : విద్యార్థులకు ఒత్తిడి సమయం. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సంతోషం కోల్పోతారు.  అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. పరిపాలన సమర్ధత ఉంటుంది. ఆలోచనల్లో ఒత్తిడి పెరుగుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. పక్కవారి సలహాలు తీసుకుని ముందు అడుగు వేయాలి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios