తాబేలు నీటిలో ఈత కొడుతుందనే విషయం మనకు తెలిసిందే. కాగా  మీ కలలో తాబేలు నీటిలో ఈదుతున్నట్లు కనిపిస్తే, అది మీ జీవితానికి చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. 

మన జీవితానికి సంబంధం లేని విషయాలు తరచూ మనకు కలలో వచ్చి ఆశ్చర్యపరుస్తాయి. అటువంటి అరుదైన కలలలో కొన్ని సూచనలు కూడా ఉంటాయట. కొన్ని కలలో కి వస్తే.. దురదృష్టగా భావిస్తే.. కొన్ని కలలోకి వస్తే అదృష్టంగా భావిస్తారు. అదేవిధంగా, తాబేలు కలలోకి వస్తే మీరు త్వరలో ధనవంతులు అవుతారని అర్థమట.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అవును, తాబేళ్లు కలలలో చాలా అరుదుగా కనిపిస్తాయి. వాస్తు, జ్యోతిషశాస్త్రంలో వీటిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. కూర్మావతారంలో విష్ణువు తాబేలు అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. అలాగే ఫెంగ్ షుయ్, వాస్తులో తాబేలు విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతూ ఉంటారు. అందుకే చాలా మంది తాబేలును గౌరవిస్తారు, పూజిస్తారు. అలాంటి పవిత్రమైన తాబేలు మీ కలలో కనిపిస్తే, త్వరలో మీకు అదృష్టం కలుగుతుందని అర్థమట.

కలలో తాబేలు కనిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం.

తాబేలు నీటిలో ఈత కొడుతుందనే విషయం మనకు తెలిసిందే. కాగా మీ కలలో తాబేలు నీటిలో ఈదుతున్నట్లు కనిపిస్తే, అది మీ జీవితానికి చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. మీరు మీ మనస్సుకు అనుగుణంగా మీ జీవితాన్ని గడుపుతున్నారని అర్థం. మీరు అనుకున్నది సాధిస్తారు. అలాంటి కల మీ నైతికతను చూపుతుంది. ఈ కల మీ భవిష్యత్ పనిలో మీరు మరింత కష్టపడవలసి ఉంటుందని కూడా సూచిస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. 


మీకు ఒక కలలో చాలా తాబేళ్లు కనిపించాయి అంటే.. అది మీకు చాలా పవిత్రమైనదిగా భావించాలట. అలాంటి కల ఏదైనా సమీప భవిష్యత్తులో మీ ఇంటికి ఆనందాన్ని తెస్తుందని అర్థమట. ఆనందం రాకతో, మీ కుటుంబ సభ్యులందరూ కలిసి జీవిస్తారని అర్థం. ఈ కల మీ ఏకాగ్రతను కూడా చూపుతుంది.

మీకు కలలో మీరు ఇంట్లో తాబేలు రావడం లాంటివి జరిగితే.. మీకు త్వరలో చాలా డబ్బు వస్తుందని అర్థం. ఇది మాత్రమే కాదు, త్వరలో మీ డబ్బును తిరిగి పొందే సంకేతాలు కూడా ఉన్నాయి.

కలలో తాబేలు ఆహారం తినడం మీరు చూస్తే, మీరు సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. అంటే లక్ష్మీ దేవి మీతో చాలా సంతోషంగా ఉంటుంది. మీకు జీవితాంతం డబ్బుకు లోటు ఉండదు. మీ కలలో తాబేలు ఇబ్బంది పడుతున్నట్లు.. ప్రాణాలతో పోరాడుతున్నట్లు మీరు చూస్తే, భవిష్యత్తులో మీరు డబ్బు కొరతను ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం. ఈ కల మీకు డబ్బు కొరత ఉందని, డబ్బు లేకపోవడం వల్ల మీరు పేదరికాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని సూచిస్తుంది.

ఒకవేళ కలలో మీరు తాబేలును వెంబడిస్తున్నట్లుగా వచ్చిందంటే.. అది అరిష్ట సంకేతాలను పొందబోతున్నారని అర్థం. కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని చాలా కాలంగా బాధిస్తున్నాయని అర్థం. కానీ మీరు ఎవరికీ చెప్పలేరు. ఒకవేళ కలలో తాబేలు మిమ్మల్ని కరిచినట్లుగా వస్తే... అది మంచి కల కాదు. దాని అర్థం.. భవిష్యత్తులో మీరు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

రెండు తాబేళ్ల జంట మీ కలలోకి వస్తే.. అది మీకు శుభ్రపదం అని అర్థమట. ఇది సంతోషకరమైన, విజయవంతమైన వైవాహిక జీవితాన్ని సూచిస్తుంది. వివాహితుడు అలాంటి కలని చూసినట్లయితే, వారికి త్వరలోనే సంతానం కలుగుతుందని అర్థమట.