Asianet News TeluguAsianet News Telugu

ఈ రాశివారిని ఆకట్టుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..?

జోతిష్యశాస్త్రం ప్రకారం. మీరు ఏ రాశివారినైనా ఆకర్షించాలని అనుకుంటే.. వారితో ఇలా ప్రవర్తించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారిచూద్దాం..

How to Attract each Zodiac sign
Author
Hyderabad, First Published Mar 31, 2022, 12:19 PM IST

ఒక్కొక్కరిలో  ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరికి కొన్ని నచ్చుతాయి. మరికొందరికి అవి నచ్చకపోవచ్చు.  ఒక వ్యక్తి ని మన చుట్టూ తిప్పుకునేలా చేయాలి అంటే.. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా.. మీతో రిలేషన్ లో ఉన్నవారిని మరింత గా ఆకర్షించాలంటే.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే.  కాగా... జోతిష్యశాస్త్రం ప్రకారం. మీరు ఏ రాశివారినైనా ఆకర్షించాలని అనుకుంటే.. వారితో ఇలా ప్రవర్తించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారిచూద్దాం..

మేషం: వెనుకడుగు వేయకండి. పట్టుకుని ఉద్రేకంతో ముద్దు పెట్టుకోండి. ముద్దుతో మీ ప్రేమ తెలియజేస్తే.. వారు మీకు ఆకర్షితులౌతారు.

వృషభం
సొగసైన, అందమైన , ఖరీదైనదిగా కనిపించే బహుమతులను వారికి ఇవ్వండి. అలాంటివి వీరికి బాగా నచ్చుతాయి. మీ ప్రేమను గుర్తించే అవకాశం ఉంది.

మిథున రాశి..
తెలివిగా మాట్లాడండి. ఎక్కడో చదివింది తీసుకువచ్చి వారి ముందు మాట్లాడుతున్నట్లుగా ఉండ కూడదు. వీరికి తెలివిగల వారు అంటే ఎక్కువ ఇష్టం. విభిన్న విషయాలను వీరితో చర్చించండి.

కర్కాటక రాశి..
ఈ రాశివారికి విలాసవంతంగా ఉండటం అంటే ఇష్టం. వారికి అలాంటి సౌకర్యాన్ని కలిపిస్తే.. మీకు ఇట్టే ఫిదా అయిపోతారు. వారికి రొమాంటిక్ డిన్నర్స్ ఎక్కువగా ఇష్టం. అలాంటి ప్లాన్ చేసి.. వారిని ఫిదా చేయండి..

సింహ రాశి..
అర్ధ హృదయంతో ఏమీ చేయవద్దు.  వీరితో ఏం చేసినా హార్ట్ ఫుల్ గా చేయాలి. అప్పుడు వారు ఇట్టే ఫిదా అయిపోతారు.

కన్య రాశి..
ఇస్త్రీ చేసిన దుస్తులలో శుభ్రంగా, తాజాగా, స్ఫుటంగా కనిపించండి, మంచి వాసన వారిని ఆకర్షితులను చేస్తుంది. మీరు ఎలాంటివారో వారు మీ డ్రెస్సింగ్ సెన్స్ చూసి చెప్పేయగలరని గుర్తుంచుకోండి. 

తుల రాశి..
అధునాతనంగా ఉండండి. మరీ ఎక్కువ  బలంగా ఉండకండి ఎందుకంటే అది వారిని భయపెడుతుంది

వృశ్చిక రాశి..
మంచి దుస్తులు ధరించండి.వారు సవాలును ఇష్టపడతారు కాబట్టి ఇంకా ప్రశాంతంగా ఉండండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే వారిని అంత తొందరగా ఆకర్షించగలరు.

ధనస్సు రాశి..
ఈ రాశివారికి కంగారుపడేవారు పెద్దగా నచ్చరు. ప్రశాంతంగా.. నిదానంగా ఆలోచించేవారంటే ఇష్టం. వీరికి  రొమాంటిక్ టూర్స్ కూడా పెద్దగా నచ్చవు. చందమామ వెన్నెల కింద డిన్నర్ ని ఇష్టపడతారు. 


మకర రాశి..
ఈ రాశివారు చాలా తెలివిగలవారు. వీరిని అంత తొందరగా మోసం చేయలేరు. కాబట్టి.. వీరిని ఆకర్షించాలంటే.. వారి సున్నితమైన ప్రాంతాల వద్ద మీరు మరింత సున్నితంగా తాకాల్సి ఉంటుంది.

కుంభ రాశి..
ఈ రాశివారిని ఆకట్టుకోవాలంటే.. చాలా స్పాంటినిటీ ఉండాలి. అంతేకాకుండా  చాలా తెలివిగా మాట్లాడాలి. మీరు చాలా యూనిక్ గా కనపడాలి. అలాంటి వారి పట్ట వీరు తొందరగా ఆకర్షితులౌతారు.

మీన రాశి..
వారి ఫాంటసీ ల్యాండ్‌కి జోడించి, వారిని ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా కాకుండా ఆలోచనాత్మకమైన ప్రదేశాలకు తీసుకెళ్లండి. వారి చమత్కారాన్ని మెచ్చుకుంటారు

Follow Us:
Download App:
  • android
  • ios