Asianet News TeluguAsianet News Telugu

మకరరాశిపై గురుగ్రహ ప్రభావం ఎలా ఉందంటే..

వీరికి తమకంటే ఉన్నతుల సహాయ సహకారాలు లభిస్తాయి. గురువుల ఆదరణతో వీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వీరి పరాక్రమం వ్యక్తమవుతుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వీరికి కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. దగ్గరి చిన్న చిన్న ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది.

gurugraha prabhavam on makara rashi
Author
Hyderabad, First Published Dec 14, 2018, 3:18 PM IST

మకరరాశివారికి గురువు అనుకూలంగానే ఉంటాడు. గోచార రీత్యా అనుకూలంగా ఉన్నప్పుడు జాతకంలో కూడా అనుకూలంగా ఉంటే వీరు ఏ పని మొదలుప్టిెనా అందులో విజయాన్ని సాధిస్తారు.

వీరికి తమకంటే ఉన్నతుల సహాయ సహకారాలు లభిస్తాయి. గురువుల ఆదరణతో వీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వీరి పరాక్రమం వ్యక్తమవుతుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వీరికి కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. దగ్గరి చిన్న చిన్న ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అన్ని పనుల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది.  మాటలు మ్లాడటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. వీరికి ఏది కావాలన్నా కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చు చేస్తేనే సహకారం లభిస్తుంది. ఆ లభించిన సహకారం వీరు దుర్వినియోగం చేసుకోకూడదు. దానివల్ల లేనిపోని అపార్థాలు వచ్చే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త పడడం మంచిది.

వీరికి సంతానం అనుకూలంగా ఉంటుంది. సంతానం వీరి మాట వింరు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. మనసుకు నచ్చిన వారితో హాయిగా కాలం గడుపుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. అన్ని రకాల సంపదలు పెరుగుతాయి. వాటిని అనుభవిస్తారు కూడా. కొన్ని రకాల సంపదలు దృశ్య సంపదలు మాత్రమే ఉంటాయి. అనగా చూడడానికి మాత్రమే. కాని భోగ్య సంపద అంటే ఉండడమే కాదు ఆ ఆనందాన్ని అనుభవిస్తారు. అంగ్లో అన్నీ ఉన్నాయి. అల్లునిన్లో శని అనే సామెతను అనుసరిస్తే వస్తువులు ఉండడమే కాకుండా వాటివల్ల సంతృప్తి  కూడా ఉండడం ముఖ్యం. వీరికి ఆ సంతృప్తి ఉంటుంది.

సామాజిక అనుబంధాలు బాగా విస్తరిస్తాయి. వీరికి పరస్పర సహకారం లభిస్తుంది. అంటే గురువులు, ఉన్నతులు మొదలైన వారితో స్నేహసంబంధాలు విస్తృతం చేస్తారు. వీరు ఎక్కడ ఉన్నా తమదైన శైలితో జీవిస్తారు. నలుగురిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ తమదైన ముద్రను వేస్తారు. అన్ని రకాల సౌకర్యాలను అనుభవిస్తారు. జీవిత భాగస్వాములతో, మరియు వ్యాపార భాగస్వాములు అనుకూలంగా ఉంటారు. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులు విస్తరిస్తాయి. వ్యాపారస్తులు మరీ స్వార్థంతో ఆలోచించకుండా కొంత దైవచింతన ఏర్పడుతుంది. తమకు ఉన్నద్లాోం పదిమందికి ప్టోలనే ఆలోచన ఉంటుంది.

అన్ని రకాల లాభాలు వీరికి వస్తాయి. పెద్దవారి ఆశీస్సులు లభించడం కూడా ఒక లాభమే. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. స్థిర, చరాస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉపాసనపై దృష్టి పెడతారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు. తమను చూసి మిగతావారు నేర్చుకోవాలనే విధంగా వీరి జీవితం ఉంటుంది. సమస్కా పరిష్కార శక్తి వీరికి ఉంటుంది.

పెద్దవారితో సహకారం తీసుకున్నప్పుడు వారికి సేవచేయడం మర్చిపోవద్దు. పెద్దవారితో సహకారం తీసుకోవడం వల్ల తొందరగా పుణ్యం ఖర్చు అవుతుంది. పుణ్యం లేకుంటే ఏ పనులు చేయలేరు. అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి. మొదలు పెట్టిన పనులు తొందరగా పూర్తికావు. ప్రతీ పనిలో కష్టాలు వస్తాయి. కావున వీరు పెద్దలతో సహకారంతీసుకునే ముందు జాగ్రత్తగా ఒకికి రెండుసార్లు ఆలోచించాలి.

సంతానం అనుకూలంగా ఉంది, సృజనాత్మకత పెరుగుతుంది, విద్యార్థులకు అనుకూల సమయం అనుకుని ఏ పనీ చేయకుండా ఉంటే వాటివల్ల మళ్ళీ కొత్త ఒత్తిడి ప్రారంభం అవుతుంది. కాబట్టి చేసే మంచి పనులు ఎప్పుడూ ఆపకుండా ఉంటే మాత్రమే వీరికి గురువు అనుగ్రహం ఎప్పటికీ ప్రశాంతంగా లభిస్తుంది.

వీరు గురువారాలు ఉపవాసం ఉండడం, శనగలు గుడిలో ప్రసాదంగా ఇవ్వడం, రాఘవేంద్రస్వామి, సాయిబాబా దక్షిణామూర్తి  ఆలయాలకు వెళ్ళి గురువారం 11 ప్రదక్షిణలు చేయడం వల్ల గురువు అనుగ్రహం తొందరగా లభిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios