ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 04.03.2025 మంగళవారానికి సంబంధించినవి.
మేష రాశి ఫలాలు
పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూలం.
వృషభ రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. స్నేహితులతో గొడవలు చికాకు తెప్పిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారం, ఉద్యోగాలు అంతగా అనుకూలంగా ఉండవు. కష్టపడ్డ ఫలితం కనిపించదు. దాయదులతో ఆస్తి గొడవలు వచ్చే అవకాశం ఉంది.
మిధున రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో కష్టం తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో నిర్ణయాలు మార్చుకుంటారు. ఉద్యోగంలో గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
భూ అమ్మకాలు, కొనుగోలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యమైన సమాచారం వింటారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.
సింహ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబంతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది.
కన్య రాశి ఫలాలు
పనులు వాయిదా పడుతాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. బంధువులతో గొడవలు చికాకు తెప్పిస్తాయి. వారి నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు వింటారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
తుల రాశి ఫలాలు
వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు వస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చిన్ననాటి స్నేహితులతో పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. బందువులతో వివాదాలు బాధిస్తాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ఆత్మీయులతో సఖ్యతగా ఉంటారు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
ధనస్సు రాశి ఫలాలు
స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరాశకు లోనుచేస్తుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు అధికారులతో సమస్యలు తప్పవు. ఒక విషయంలో సన్నిహితులతో విభేదాలు వస్తాయి.
మకర రాశి ఫలాలు
వ్యాపారాల్లో ఆశించిన లాభాలు వస్తాయి. దూర ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొంటారు.
కుంభ రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో అకారణంగా మనస్పర్థలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో స్థిరమైన ఆలోచనలు ఉండవు.
మీన రాశి ఫలాలు
శుభవార్తలు వింటారు. ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి.